పిల్లల కోసం ప్రత్యేక వైద్య విభాగం..మెగా మెడికల్ క్యాంపులో పులివర్తి వినీల్
చంద్రగిరి:
తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాపార్లమెంటరీ
అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆదేశాలతో, పులివర్తి వినీల్ పర్యవేక్షణలో డాక్టర్ పులివర్తి త్రిష్య రెడ్డి నిర్వహిస్తున్న మెగా వైద్యశిబిరంకు అనూహ్య స్పందన వచ్చింది. చిన్నగొట్టిగళ్లు మండలం, భాకరాపేటలో డాక్టర్ పులివర్తి త్రిష్య రెడ్డి ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తి వినీల్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన విద్య,వైద్యంఅందించాలన్నదే నాన్న(పులివర్తి నాని) లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి 4నెలలకు ఒకసారి మెగా వైద్యశిబిరం నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇతర వైద్యులతో కాకుండా డాక్టర్ పులివర్తి త్రిష్య రెడ్డితో నిర్వహించాలన్నదే పులివర్తి నాని కోరిక అని చెప్పారు. చిన్నపిల్లల డాక్టర్ పులివర్తి త్రిష్య రెడ్డి తన స్నేహితులైన డాక్టర్స్ తో కలిసి క్యాంపు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు, పాములు, విష పురుగులు కారణంగా రోగాలు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. స్వచ్చమైన తాగునీరు లేక పిల్లలు విరోచనాలు, వాంతులు ఇతర సీజనల్ వ్యాధులతో చిన్నారులు రోగాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరమైతే పీలేరు, తిరుపతికి హాస్పిటల్ లకు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్నగొట్టికల్లు, యర్రావారిపాళెం రెండు మండలాలో చిన్నపిల్లల కోసం ప్రత్యేక వైద్య విభాగం హాస్పిటల్ తీసుకువస్తామన్నారు.
ప్రపంచంలో ఎక్కడా ఉచిత మెడికల్ క్యాంపు కు ఆధార్ కార్డులు తీసుకోరని, ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి మనసుతో పిల్లలు కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు. అలాగే మల్టీ విటమిన్ సిరప్, ప్రోటీన్ పౌడర్, దగ్గు మందు, ఓఆర్ఎస్ ఫ్యాకెట్స్ ఉన్న మెడికల్ కిట్స్ అందజేశామని పులివర్తి వినీల్ చెప్పారు.