Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలువిశాఖ స్టీల్ పోరాటానికి మద్దతుగా అఖిలపక్షం ఆందోళన

విశాఖ స్టీల్ పోరాటానికి మద్దతుగా అఖిలపక్షం ఆందోళన

ప్రజా భూమి పోరుమామిళ్ల
విశాఖ ఉక్కు పరిశ్రమను ఆపాలని గత 800 రోజులుగా ఉక్కు పరిశ్రమ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా, వామపక్ష కార్మిక సంఘాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా, బుధవారం పోరుమామిళ్ల పట్టణం, అంబేద్కర్ సర్కిల్ లో చేపట్టిన ఆందోళనకు, మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రవి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ , కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ అన్వర్ లు పాల్గొని, వారు మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వ ఆస్తులను తమ సొంత మిత్రులకు ధారా దత్తం చేసే క్రమంలో విశాఖ స్టీల్ పై కూడా వారి డేగ కన్ను పడిందని వారు ఎద్దేవా చేశారు. 1970లో అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ హయాం లో 32 మంది బలిదానాలు చేసి, కొన్ని సంవత్సరాలు పోరాడి సాధించిన విశాఖ స్టీల్ ను దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, దక్షిణ కొరియాకు చెందిన పోస్కో , మోడీ మిత్రుడు ఆదానిలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% అప్పగించాలని కుట్ర జరుగుతుందని వారు పేర్కొన్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఏర్పాటు చేసిన ఈ ఉక్కు పరిశ్రమ, దిన దినాభివృద్ధి చెందుతూ ! వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంపాదించి పెడుతుందని, అలాగే 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.6 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్నులకు పెంచడం జరిగిందని వారు గుర్తు చేశారు. కానీ బిజెపి ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాలతో , ముడీ సరుకు కొనేదానికి కూడా డబ్బు లేదు అని ఒక నెపం నెట్టి , స్టీల్ ప్లాంట్ లో 30% ఉత్పత్తిని తగ్గించి , విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందని ప్రజలకు నమ్మించి , తన మిత్రులకు ధారా దత్తం చేసే కుట్ర జరుగుతుందని, దీనిని వెంటనే ఆపేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కుట్రలు ఆపేంత వరకు వామపక్షాలు, ప్రజా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని వారు తెలిపారు. విశాఖ స్టీల్ ప్రైవేటు కరణ పై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడకపోవడం శోచనీయమని, విశాఖ స్టీల్ పై వారి వైఖరి ప్రజలకు తెలపాలని వారు కోరారు. మీ వైఖరులతో విసిగి వేసారిన ప్రజలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరలోనే బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుడిగి శ్రీను, ఇన్సాఫ్ నాయకులు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article