ఉప్పుటూరి చిన్న గురవయ్య, షష్ఠి దేవస్థాన కమిటీ
హనుమంతునిపాడు:హనుమంతునిపాడు మండలం వీరరామాపురం గ్రామంలో శ్రీ రాజశ్యామలాంబ సమేత ఓంకారేశ్వరస్వామి వారి దేవస్థానంను భారతి పుష్పగిరి శంకరా స్వాముల వారు స్థాపించారు.ఈ దేవస్థానంకు మధ్యప్రదేశ్ నర్మదానది నుండి శివలింగం తెచ్చి ప్రతిష్టించారు.ఆ నాటి శివలింగం నేటి వరకు భక్తులను పరవసింప జేస్తుంది. గత డెబ్భై సంవత్సరాలకు పైగా ఆర్యవైస్యులు చక్కా వారు కనమర్లపూడి వారు దేవస్థానంను ముందుండి నడిపిస్తూ ఆర్యవైశ్య అన్నసత్రం నందు అన్న సంతర్పణ జరుగుతుంది.ఈ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో పురాతన దేవస్థానం కావడం వలన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. గురువారం రాత్రి 6 గం!! నుండి శుక్రవారం ఉదయం 6 గం!! వరకు “శంకర శివశంభో మహాదేవ శంకర శివసుభకర, శంకర అర్ధ ఏకాహాము జరిపించబడును. 08-03-2024 ఉదయం 6 గం!!ల నుండి స్వామి వారికి మహాన్యాస పూర్వక పంచామృత రుద్రాభిషేకం, వివిధ పూజా కార్యక్రమాలు మరియు స్వామి వారి కళ్యాణమహోత్సవం జరిపించబడును. ఈ దేవస్థానంకు మాగాణి పది ఎకరాలు మెట్ట భూమి వంద ఎకరములు మొత్తం 110 ఎకరాలు ఉన్నది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మచ్చ.వెంకటేశ్వర్లు సార్ బంధు బృందం ఒక అన్నదాన సత్రం యువనాయకులు కొల్లూరి శివ మిత్ర బృందం మరొక అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలలో బాగంగా కులుకు భజన కార్యక్రమంను యువ నాయకులు ఉప్పుటూరి పిచ్చయ్య కుమారులు గురుస్వామి గుంటేయ్య ఉప్పుటూరి తిరుపతయ్య కుమారుడు శ్రీనివాసులు ఏర్పాటు చేయగా”పాట కచ్చేరి” నాయకులు బత్తుల బ్రదర్స్ నారాయణ రమణయ్య చిరంజీవి ఏర్పాటు చేశారు.