మార్కాపురం పోల్ మానేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి
మార్కాపురం :మార్కాపురం మాజీశాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గం పోల్ మానేజ్మెంట్ ఇంచార్జి కందుల రామిరెడ్డి మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్ మార్కాపురం పట్టణంలోని 9 వ వార్డులో ” మనకోసం – మన కందుల మరియు భవిష్యత్తుకు గ్యారెంటీకార్యక్రమంనిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేస్తే విధ్వంస పాలనకు ఓటు వేసినట్టేనని గత ఐదు సంవత్సరాలు నుండి రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు, ఇష్ట రాజ్యాంగా కూల్చివేతలు, దోపిడీ మరియు అక్రమణాలతో వైసిపి పాలకులు పాలన సాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మార్కాపురం ప్రజలు ప్రత్యేక జిల్లాకు ఓటు వేస్తారా లేక వైసిపి విధ్వంసం పాలనకు ఓటు వేస్తారో ఆలోచించాలని నాకు ఓటు వేస్తే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధిస్తానని వైసీపీకి ఓటు ప్రజలకు విధ్వంసం పాలన బహుమతిగా ఇస్తారని గుర్తు చేశారు.
పట్టణ తెలుగు మహిళలు, పట్టణ తెలుగుదేశం జనసేన నాయకులు, 9 వ వార్డు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు