ఆ మీడియా.. కరుడుగట్టిన పసుపు దండు బ్యాచ్..
- ఎవరైతే కరుడుగట్టిన పసుపు దండు సభ్యులుగా ఉన్నారో.. వారు- ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 లాంటివాళ్లు అక్కడకు వెళితే ఎవరికైనా కచ్చితంగా ఆవేశం వస్తుంది.
- వారు టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు.
- మీరేమో ఒక పక్క అవినాష్ నాటకాలు వేస్తున్నాడు అంటారు..ఆ సమయంలో మీరు కన్పిస్తే ఎవరికో ఆవేశం వస్తే దాన్ని మీడియా మీద దాడి.. అంటూ గగ్గోలు పెడుతున్నారు.
- దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. నిజమైన మీడియాపై ఎక్కడ ఏది జరిగినా బాధ పడతారు.
- మీరు బాధ్యతాయుతంగా ఉండి…ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే దాన్ని ఖండించాల్సిందే.
- అలాంటి అంశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ గారు సహించరు.
- జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు. వందమందో, వెయ్యి మందో ఉన్న చోట ఖచ్చితంగా ఎవరో సంబంధం లేని వారు ఆవేశంగా రావచ్చు.
- ఆ ఆవేశం వచ్చేటట్లు మనం ఎందుకు ప్రవర్తించాలి….?
- అవినాష్ తల్లిగారి ఆరోగ్యం బాగోలేకపోయినా మీరు నాటకాలు అంటూ బ్రేకింగ్ లు వేసి, ఆ లోగో పట్టుకుని మళ్లీ అక్కడకు వెళ్లినప్పుడు కార్యకర్తలు ఆవేశపడటం సహజం.
- ఎవరో ఒకరిద్దరు రియాక్ట్ అవ్వొచ్చు. దాన్ని ఖండిస్తాం. కానీ ఇలాంటి రాతలను కూడా ఖండించండి అని అడుగుతున్నా.
- మొన్న కూడా తల్లికి ఆరోగ్యం బాగోలేక వెళ్తున్నాడు అని మీరే బ్రేకింగ్స్ వేశారు.
- మళ్లీ మీరే వెంటపడి వెళ్లారు..అలా వెళ్ళాల్సిన అవసరం ఏముంది..?
- ఆయనేమన్నా అండర్ గ్రౌండ్ నుంచి అప్పుడే బయటకు వచ్చాడా..?
- గుత్తి వరకూ వెళ్లి బెంగుళూరు వెళ్తాడా..? మరో వైపు వెళ్తాడా అంటూ ఊహాగానాలు వేస్తారు.
- ఎదురుగా మళ్లీ అదే మీడియా కన్పిస్తుంది… అలాంటప్పుడు ఏంటీ తప్పుడు రాతలనే కోపం ఎవరికైనా వస్తుంది.
రాష్ట్రపతి పాలన అని, కేంద్ర బలగాలు వస్తున్నాయని ఏమిటా రాతలు, కూతలు..?:
- రాష్ట్ర పోలీసులు, సీబీఐకి సంబంధించి… వీళ్లేం కోరారు..వాళ్ళేం చెప్పారు అనేది ఆ రెండు శాఖల మధ్య విషయం.
- బలగాలు వస్తున్నాయి అని రాశారు.. మరి ఎందుకు రాలేదు..?
- కేంద్ర బలగాలు రావడం అనేది అంత సాధారణమా..?
- సినిమాలకు థర్డ్ గ్రేడ్ రైటర్ కథలు రాసినట్లు వీళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు.
- అసలు రాష్ట్రపతి పాలన పెట్టడం ఏంటి..? కేంద్ర బలగాలు రావడం ఏమిటి..?
- ఒక బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది కూడా వీళ్ళు కనీసంగా ఆలోచించడం లేదు.
- అవినాష్ రెడ్డి తనకు ఉన్న రైట్ ప్రకారం, విచారణకు మరికొద్ది సమయం కోరారు…అతనికి ఉన్న హక్కుల ప్రకారం కోర్టులకు వెళ్లవచ్చు.
- రామోజీ మార్గదర్శి కేసును ఆపడానికి తట్టని కోర్టు తలుపులు లేవు. ఆయన చేస్తే న్యాయం. అవినాష్ రెడ్డి కోర్టుకు వెళితే అన్యాయమా.. ?
- మార్గదర్శి విషయంలో మహిళ ఉద్యోగులు ఉంటే.. సీఐడీ వాళ్లు వచ్చి కూర్చున్నారు అని అంటారు.
- అర్ధరాత్రి అవినాష్ ఇంటి డోర్‌కు నోటీసు అంటిస్తే…ఆ సమయానికి అవినాష్ లేకపోయినా కూడా, ఆయన తప్పే అన్నట్టుగా మీరే రాస్తున్నారు.
రామోజీకి ఒక న్యాయం..అవినాష్ కి మరో న్యాయమా..?
- చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా జీవో ఇచ్చాడు.
- ఈనాడులో అప్పుడు కుక్కకు తోక కత్తిరించినట్లు పెద్ద కార్టూన్ కూడా వేశారు.
- మళ్లీ ఇప్పుడు వారికి అదే సీబీఐ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.
- రామోజీకి ఒక న్యాయం..అవినాష్ కి మరో న్యాయమా..?. రామోజీ న్యాయ పరంగా ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకోవచ్చు..కానీ అవినాష్ మాత్రం అలా చేయకూడదు అంటాడు.
- అవినాష్ సమయం అడిగాడు..సీబీఐ సమయం ఇచ్చిందనుకో ప్రపంచం తలకిందులు అవుతుందా..?
- రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, టీవీ5 నాయుడు తప్ప ప్రపంచంలో మిగిలిన వారంతా వారి దృష్టిలో అవినీతి పరులే.
- వీళ్లు ఏ హక్కునకూ ఆర్హులు కారు.. కోర్టులకు వెళ్లకూడదు..అసలు ప్రజలు ఎన్నుకోడానికే వీళ్లేదు అంటాడు.
- అవినాష్ రెడ్డి తల్లిని కర్నూలులోనే ఎందుకు చేర్చారు అంటూ చర్చలు పెడుతున్నారు.
- అసలు ఇప్పుడే ఆమెకు అనారోగ్యం ఎందుకు వచ్చిందని కూడా వాళ్లు అడుగుతారు.
- బెంగుళూరు వెళితే పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్లారు..మన రాష్ట్రంలో వైద్యం లేదా అని కూడా రాస్తారు.
- హైదరాబాద్ వెళ్తే కేసీఆర్ ఫ్రెండ్ కాబట్టి వెళ్లారు అంటారు.
- వివేకా హత్య కేసులో కూడా వీళ్లే ట్రైల్ చేసి శిక్షలు కూడా వేసేస్తున్నారు.
- వీళ్లు రాసే రాతల్లో, వీళ్ల కథనాలు, వీళ్ల డిబేట్లు అన్నిటి ఉద్దేశం ఒక్కటే.. ఎదుటి వారి వ్యక్తిత్వ హననం.
- ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి వ్యక్తిగత అంశాలపైకి తిప్పుతుంటారు.
తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే డ్రామాలంటారా?
- అవినాష్‌రెడ్డి ఇప్పటికి ఆరేడు సార్లు సీబీఐ విచారణకు వెళ్లాడు.
- సీబీఐకి సహకరిస్తున్నారు..ఆయన ఎక్కడికీ పారిపోలేదు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్నారు.
- తల్లికి ఆరోగ్య బాగోలేదు.. తండ్రి జైళ్లో ఉన్నారు కాబట్టి తాను ఒక లేఖ రాసి సమయం అడిగారు.
- అది కేవలం సీబీఐ, అవినాష్‌రెడ్డికి సంబంధించిన వ్యవహారం.
- ఒక వేళ వారు రాష్ట్ర పోలీసులతో మాట్లాడి ఉంటే చట్టప్రకారం వారి పని వారు చేసుకుంటారు.
- సీబీఐ కానీ, ఇంకెవరూ దానిపై మాట్లాడటం లేదు.
- అవినాష్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీం కోర్టు.. హైకోర్టుకు వెళ్లమన్నట్లుంది.
- ఈ ఎల్లోమీడియా మాత్రం కేంద్ర బలగాలు దిగుతున్నాయి అని రాస్తున్నారు.
- వాళ్లే కేంద్ర బలగాలు వస్తున్నాయి అంటారు..మళ్లీ రాకుండా చేశారు అని కూడా వాళ్లే రాస్తారు.
- నిన్నంతా ఆ రెండు మూడు చానళ్లు ఇష్టారీతిన డిబేట్లు పెట్టాయి.
- సీబీఐకి ఎస్పీ సహకరించడం లేదు అని ఎవరు చెప్పారు..? ఎస్పీ రాధాకృష్ణ చెప్పారా..? సీబీఐ చెప్పిందా..?
- నిన్న బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది..దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇదంతా చేశారు.
- వాళ్లకి వారుగా క్రియేట్ చేసిన తుఫాన్ ఇది.
మీ రాతలు చూస్తే ఎవరికైనా ఆవేదన, ఆవేశం వస్తుంది.
- మా పార్టీ అభిమానులు ఆవేశం, బాధ కలిగినవారు అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వస్తారు.
- మీరు ఇలాంటి రాతలు రాయబట్టే కదా.. వారంతా బాధతో బయటకు వస్తున్నారు..?
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కార్యకర్తలు లేరనుకుంటున్నారా..? కోట్ల మంది అభిమానులున్నారు… ఎవరికి అన్యాయం జరిగినా వారంతా తప్పకుండా వస్తారు..
- మీరు రాసే ఘోరమైన రాతలు చూస్తే.. ఎవరైనా ఆవేదన, ఆవేశం వస్తుంది.
- మీ రాతలతో కుటుంబాన్ని పలుచన చేయాలని చూస్తున్నారు… తల్లి ఆరోగ్యం బాగోలేదంటే డ్రామాలు, నాటకాలు అంటున్నారు.
- ఆ తప్పుడు రాతలు చూస్తే ఎవరికైనా కడుపుమండకుండా ఉంటుందా..? మీ మీద ఇలాగే రాస్తే ఊరుకుంటారా..?
- వాళ్లిష్టం ఏదైనా అంటారు…నిన్న ఎవరో రాష్ట్రపతి పాలన విధించాలి అంటున్నాడు.
- ఆ డిబేట్లలో కూర్చునే వాళ్లని చూస్తే అసలు ప్రపంచ యుద్ధాన్ని కూడా సృష్టించగల శక్తి వారికుందేమో అనిపిస్తుంది.
- ఇదంతా చూశాక అభిమానించే మా పార్టీ వారిలో బాధ, ఆక్రోశం రాకుండా ఎలా ఉంటుంది..?
- రియల్ మీడియాపై ఎవరిమీదైనా దాడి జరిగిందా..?
రాష్ట్రాన్ని దేశానికే దిక్చూచిలా నిలిపిన నాయకుడు శ్రీ వైఎస్జగన్
- పార్టీ పెట్టిన 8 ఏళ్లలోనే రీసౌండింగ్ విక్టరీతో 151 స్థానాల్లో విజయం సాధించాం.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలా అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ఆ ఫలితాలు వచ్చాయి.
- ముందుగానే తయారు చేసుకున్న బ్లూ ప్రింట్ ప్రకారం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నారు
- మే30న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నాలుగేళ్లలో 98.5 శాతంపైగా హామీలను పూర్తిగా అమలు చేశారు.
- ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకం అయిన పార్టీ పనితీరు ఎలా ఉంటుంది, అలాంటి పార్టీపై ఆశలు పెట్టుకుంటే ఎంత సక్రమంగా అమలు చేసి చూపుతారు అనేది ఈ నాలుగేళ్లలో ప్రస్ఫుటంగా కన్పించింది.
- ఈ నాలుగేళ్లలో రాష్ట్రం దేశానికి దిక్చూచిలా నిలబడేలా చేసిన నాయకుడు శ్రీ వైఎస్జగన్
- పాలన వికేంద్రీకరణ, గడప వద్దకు పాలన వంటి వాటి ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారు.
- పారదర్శకంగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం వల్ల పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.
జగన్ గారు ఉంటేనే సంక్షేమం-అభివృద్ధి..
- రాష్ట్రంలో పెట్టబడులు వెల్లువలా రావడానికి కారణమయ్యే నాలుగు కీలక పోర్టులను ఈ నాలుగేళ్లలోనే చేపట్టాం.
- రామాయపట్నం పోర్టు వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చు. మిగిలినవి రానున్న రెండుమూడేళ్లలో పూర్తి అవుతాయి.
- మనకున్న సుదీర్ఘ కోస్తా తీరాన్ని వినియోగించుకునేలా వాస్తవ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నారు సీఎం జగన్ గారు.
- జగన్ గారు ఏం చేస్తున్నారు అనేవారికి ఇవన్నీ సమాధానాలు.
- అభివృద్ధి అంటే నాలుగు చిన్న ఫ్యాక్టరీలు పెట్టడమే కాదు..చోదక శక్తుల వంటి పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు, రోడ్ల విస్తరణ.. లాంటివన్నీ ఆర్ధికాభివృద్ధికి చోదకాలుగా నిలుస్తాయి.
- ఒక పక్క పేదరికం నుంచి ప్రజలను పైకి తీసుకురావడం, మరో పక్క ఆర్ధికాభివృద్ధిని పెంపొందించడానికి చోదకశక్తులను ప్రోత్సహించడం చేస్తున్నాం.
- పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే జిల్లాల విభజన జరిగింది.
- మూడు రాజధానులు వ్యవహారం.. కోర్టు కేసులను దాటుకుని వచ్చిన తర్వాత, ఆచరణలోకి వస్తే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతోంది.
- ఇప్పటికే రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం.
- జగన్ గారు ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి సాగుతుందని ప్రజలు గ్రహించారు.
- 2019 ఎన్నికల కంటే రీసౌండ్ విక్టరీ 2024లో ఉండబోతోంది.
ఈనాడు కడుపు మంటకు మందే లేదు.
- రూ. 10 వేల కోట్లు ఇచ్చి కేంద్రం ఒక్కసారి పెద్ద ఊరట ఇచ్చిందని ఒక పత్రిక రాసిన వార్తలు చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు.
- సమర్ధంగా పనిచేస్తున్నాం… రావాల్సిన నిధులను రాబట్టుకుంటున్నాం.
- అవి హక్కుగా రాష్ట్రాలకు రావాల్సినవి…బాధ్యతగా కేంద్రం ఇచ్చే నిధులు.
- నిధులు సరిగ్గా మేం తెచ్చుకోలేకపోతే అది ప్రభుత్వ అసమర్దత అవుతుంది.
- గతంలో చేయలేనిది ఇప్పుడు మేం చేశాం.
- ఈనాడులో వారి కడుపు మంటకు ఏ మందూ పనికిరాదేమో అనిపిస్తోంది.
- రాష్ట్రానికి ఊరటో… జగన్మోహన్రెడ్డి సర్కార్‌కి ఊరటో అర్ధం కాని రాతలు రాస్తున్నారు.
- విచిత్రంగా డబ్బుల వాన అని రాశారు. కేంద్రం నుంచి రావాల్సింది తీసుకొచ్చాం.
- జగన్ గారు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి తీసుకొస్తున్నారు.
- వీళ్లే ఒక్కొక్కసారి రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదు అని కూడా రాస్తారు..
- ఇప్పుడేమో కేంద్రం కరుణ చూపించిందంటూ రాస్తున్నారు.
- చంద్రబాబు కేంద్రంలో పార్టనర్‌గా ఉండి కూడా తీసుకురాలేకపోయాడంటే అది అతని చేతగాని తనం.
- ఇన్నాళ్లు జగన్ గారు ఏం చేస్తున్నారు అనేవారికి ఇదే మా సమాధానం.
- తన రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు, ప్రజలు తనకు ఇచ్చిన అధికారాన్ని తాకట్టు పెట్టాడు.
- ఓటుకు కోట్లు ఎరవేసిన కేసులో పరారై ఇక్కడకు ఎలా వచ్చాడో… అలానే కేంద్రంలో కూడా తన వ్యక్తిగత అవసరాలనే చూసుకున్నాడు.
రాష్ట్రానికి మంచి జరిగినా భరించలేనితనం:
- రాష్ట్రానికి రావాల్సిన నిధులకు.. ఏదైనా అడ్డంకి వచ్చిందటే వారికి ఎంతో ఆనందం.
- వారు చెప్పినట్టుగా జరగకపోతే ఎన్జీటీ, కేంద్రం మీద కూడా తప్పుడు రాతలు రాస్తారు.
- రాష్ట్రాన్ని వీరంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదు.
- చంద్రబాబును అర్జెంటుగా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనే దుగ్ధతో రాష్ట్రానికి మంచి జరిగినా భరించలేని తనం వారిలో కన్పిస్తోంది.
- ఎక్కడో తెలంగాణాలో కూర్చుని వారు రాసేరాతలు చూస్తుంటే వీరికి రాష్ట్రంపై ప్రేమ ఉండే అవకాశం ఏమాత్రం లేదనిపిస్తుంది.
- వీళ్లంతా నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్…హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు.
- రాష్ట్రంపై ఎటూ ప్రేమ లేదు… రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే వీరికి బాధ. చెడు జరిగితే వారికి ఆనందం
- దానికి తోడు వారి కడుపులోని కుళ్లు నగ్నంగా చూపెట్టుకుంటున్నారు.
- నిధులు వచ్చినా, రాకపోయినా పట్టుదలగా చెప్పిన ప్రకారం చెప్పినట్టు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మాది.
- చంద్రబాబులా, తన స్వార్థం కోసం అధికారాన్ని వినియోగించుకునే వ్యక్తి జగన్ గారు కాదు
- వ్యక్తిగత అవసరాల కోసం అధికారాన్ని వాడుకునే వాడు అయితే పరిస్థితి వేరేలా ఉండేది.
- కాదు కాబట్టే చంద్రబాబుపై కేసులు నాలుగేళ్లపాటు కోర్టులు దాటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
- చంద్రబాబు హయాంలో దారుణమైన స్కాంలు, దోపిడీలు జరిగినా.. చట్టం తన పని తాను చేయాలని వదిలేశారు.