రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎస్బి.అంజాద్ భాష, నగర మేయర్ కే.సురేష్ బాబు.
కడప సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరవాతే మిగతా పార్టీలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష స్పష్టం చేశారు. కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా కడప మాసాపేట కు చెందిన సీనియర్ నాయకుడు గుండ్లపల్లి గరుడాద్రిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో కడపలోని అపూర్వ కళ్యాణ మండపంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మేయర్ సురేష్ బాబు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరికి కృషి చేయాలని సూచించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి వైసిపి అండగా ఉండడంతో పాటు న్యాయం చేస్తామని వారు స్పష్టం చేశారు. జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన గుండ్లపల్లి గరుడాద్రిని వైసీపీ నేతలు ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి , కడప మేయర్ సురేష్ బాబులతో పాటు ఇతర నాయకులకు గరుడాద్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, నాయకులు జయచంద్రారెడ్డి తోటా కృష్ణ రామ్మోహన్ రెడ్డి దాసరి శివ సాయి హుస్సేన్ ఎల్లారెడ్డి రమేష్ రెడ్డి సాయి దత్త మధు కార్పొరేటర్లు బాలకృష్ణారెడ్డి రామలక్ష్మణ రెడ్డి త్యాగరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎస్సీ సెల్ నాయకులు ఇతర ముఖ్య సనేతలు పాల్గొన్నారు.