Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలువైకాపా నాయకులు దౌర్జన్యం మానుకోవాలి

వైకాపా నాయకులు దౌర్జన్యం మానుకోవాలి

భయపడను.. రాష్ట్ర ప్రజలు తోడుగా ఉన్నారు
ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది:నర్రెడ్డి సునీత

పులివెందుల
ఎవరు ఎంత బెదిరించినా భయపడే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రజలు, కడప ప్రజలు తమకు తోడుగా ఉన్నారని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత రెడ్డి అన్నారు శుక్రవారం ఆమె తన నివాసం లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పట్లో తన నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తీసుకుని, తర్వాత విత్ డ్రా కూడా చేసుకున్నారన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇది టిడిపి వాళ్లు చేయించారని చెప్పారని సాక్షి పేపర్లో కూడా నారాసుర రక్త చరిత్ర అని ప్రచురించారన్నారు.ఈ కేసు ను సీబీఐ విచారణ చేపట్టి చార్జిషీట్ కూడా ఫైల్ చేసిందన్నారు గత ఐదు సంవత్సరాల్లో దీని గురించి చాలామంది మాట్లాడారని,ఎవరైతే కేసు పెట్టారో వారు, వారి సపోర్టర్స్ కూడా చాలా సందర్భాల్లో చాలా రకాలు గా మాట్లాడి నిందలు వేశారన్నారు ఈ ఐదు సంవ త్సరాలు ఈ విషయంపై ఎక్కువ మాట్లాడకూడదని నేను మాట్లాడటం మొదలుపెట్టాక ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడిపోతాం అని భయపడి కోర్టుకు వెళ్లినట్లుగా అనిపిస్తుందన్నారు.అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో అఫిడవిట్ దాఖలు చేశారనిదానిలో ఆయనపై రెండు కేసులు ఉన్నట్లుగా వెల్లడి చేశారు. ఈ కేసుతో పాటు మరో కేసు కూడా ఉందని తెలిసిందన్నారు.ఎలక్షన్ కమి షన్,సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అలాగే అటువంటి వ్యక్తిని ఎందుకు తమ అభ్యర్థిగా పెట్టుకుంటున్నామో కూడా రాజకీయ పార్టీలు చెప్పాల్సి ఉంటుందన్నా రు. అలాగే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడకూడదు అనటం ఎలా సమంజ సం అవుతుందని అయినా తాను ఛార్జ్ షీట్ లో ఉన్న ఇష్యూస్ మాత్రమే తెలుపుతున్నాను అన్నా రు.చార్జిషీట్ లో లేని విషయాలు మాట్లాడటం లేదని కానీ ఏపీలో కడప జిల్లా కోర్టు వారు దానిపై మాట్లాడొద్ద ని ఆర్డర్ ఇవ్వడంతోపాటు తనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు పరువునష్టం దావా వేయడం జరిగిందన్నారు.పార్టీ అనేది ఒక వ్యవస్థ, పార్టీకి పరువు నష్టం దావా వేసే అవకాశం ఉండదన్నారు. ఈపిటిషన్ లో మాకు అన్యాయం జరుగుతుంది మా గౌరవానికి భంగం కలుగుతుంది అని రాశారన్నారు .దీనిపై లాయర్లతో చర్చించి హైకోర్టుకు వెళ్లాలో సుప్రీంకోర్టుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారన్నారు. మీ బెదిరింపుల కు భయపడేదే లేదు న్యాయం ఎటువైపు ఉందో వారికి అటువైపు వారికి కచ్చితంగా జస్టిస్ అనే జరుగుతుంది అని పులివెందులలో ఒక వ్యక్తిని కొట్టి కార్యకర్తలని ఆ విధంగా బెదిరిస్తున్నారని, ఇటువంటి ఆర్డర్లు తీసుకువచ్చి నన్ను ఈ విధంగా బెదిరిస్తున్నారని,దీనికి భయపడేది లేదని పులివెం దుల ప్రజలు, కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల అండతో మేము పోరాడుతామని,మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం మాకుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article