అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి
ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
ప్రజాభూమి,లింగాల,
లింగాల పంచాయతీ పరిధిలో రాములోరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడ ప్రాచీన కాలం నాటి రామాలయాన్ని భక్తుల సహకారంతో పునరు ద్ధరించారు. గ్రామ పెద్దల సహాయ సహకారాలతో సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంపీ అవినాష్ రెడ్డి, ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డి గ్రామస్తులు పూర్ణకుంభ తో అవినాష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంత రం రాజేష్ స్వామి ఎంపీ అవినాష్ రెడ్డి చేతుల మీదుగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పట్టు వస్త్రాలు ఎంపీ అవినాష్ రెడ్డితలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం సీతారామ కళ్యాణం అంగరంగ వైభవం గా నిర్వహించారు. కళ్యాణ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్నినిర్వహించారు.సాయంత్రం స్వామివారిని బ్యాండ్ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో దేవతామూర్తుల వేషధారణలతో బృందావన్ కాలనీవాసుల నృత్య ప్రదర్శన ఎంతగానో ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బాబు రెడ్డి, మనోహర్ రెడ్డి, తదితర వైకాపా నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.