యనమల దంపతులు ప్రత్యేక పూజలు
తుని
తొండంగి మండలం ఏవి నగరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. భీష్మ ఏకాదశి వేడుకలు శోభాయమానం చేశాయి. గ్రామంలో కొలువుతీరిన శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏడవ బ్రహ్మోత్సవాలను భక్తులు కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు, గోపీనాథ్ దివ్య దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛారణాలతో విశేష పూజలు గావించారు. వేకువ జామునే సుప్రభాత సేవ, నవనీతా సేవాకార్యక్రమాలు ఆలయం అర్చకులు నిర్వహించారు. అదేవిధంగా 108 అష్టోత్తర కలశస్నవనం, మహా సంప్రోక్షణ, మహ నారాయణ హోమాలు శాస్త్ర రక్తం గా జరిగాయి. అనంతరం శ్రీ రమి సమేత సత్యనారాయణ స్వామి వ్రతం శ్రద్దా భక్తులతో జరిగాయి. పరిసర గ్రామాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. గోవింద నామస్మరణ మారుమోగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన జరిగింది. వేలాది మంది భక్తులు వచ్చి అన్ని తీర్ధ ప్రసాదాన్ని స్వీకరించారు