బుర్రా పై పూల వర్షం… కందుకూరు సమన్వయకర్తకు ఘన స్వాగతం….
కనిగిరి :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడ్లూరు మండల కేంద్రంలో గురువారం కనిగిరి ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట సారిగా గుడ్లూరు వచ్చిన బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ ర్యాలీతో ఘన స్వాగతం అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానించారు. గుడ్లూరు స్థానిక సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బుర్రా మధుసూదన్ యాదవ్ అంకమ్మ తల్లి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో కందుకూరు నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కొరకు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలాగా కృషి చేశారు. విద్య, వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగినది. ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు అందించిన ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రానున్న ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్ సీపీ మండల నాయకులు, కార్యకర్తలు ,ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.