ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు
ప్రజాభూమి,మండపేట
వైసీపీ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారుతనమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మంగళవారం స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల అవసరాలు ప్రభుత్వ స్కూళ్లు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు తదితర వాటి ఫిల్లింగ్ కోసం మండలంలోని కేశవరం గ్రామంలో 2.50 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలింపుకు అనుమతులు తీసుకున్నామన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు నియోజవర్గంలో ఏమి చేస్తారో చెప్పాలన్నారు. ఓట్లు వేసి గెలపించిన కేశవరం గ్రామ ప్రజలు మీ దృష్టికి కిరాయి మనుషుల్లా కనబడుతున్నారని ప్రశ్నించారు. మట్టి, ఇసుక, గ్రావెల్ తదితర వాటికోసం ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కొన్ని పత్రికలు ఆయనకు ఇసుకాసురుడని పేరు ఇచ్చేయన్నారు.ఏదేమైనా జనవరి నెల ఆఖరు నాటికి కేశవరం గ్రామంలో గత ప్రభుత్వంలో పట్టాలి ఇచ్చిన అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో వైసిపి పట్టణ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి వరప్రసాద్, ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.