చంద్రగిరి:
తిరుపతి రూరల్ మండలంలో టీడీపీ వాల్ పోస్టర్స్ పంచాయితీ అధికారులు అనుమతులు లేవంటూ తొలగించడంతో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట జనసేన, టీడీపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీ ద్వారా ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా పంచాయితీ కార్యాలయాల్లోనే ఎమ్మెల్యే తనయుడు ఫోటోలు పెట్టుకున్న పట్టించుకోరు. తెలుగుదేశం పార్టీ, పులివర్తి నాని పేరు విన్నా, కనిపించినా ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సొంత డబ్బులతో వారి ఇళ్లకు స్టిక్కర్లు వేసుకుంటే తొలగిస్తున్నారు. అనుమతులు తీసుకోమన్నారు. గత నెల 28వ తేదీ అన్ని పంచాయతీ కార్యాలయాల్లో అనుమతులు కోరాం. కలెక్టర్, డిపివో, ఎంపీడీవో లకు కూడా పర్మిషన్ కోసం వినతిపత్రం అందజేశాం. స్టిక్కర్లు, బ్యానర్లుకు పన్నులు ఎంత చెల్లించాలో తెలియజేయాలని కోరాం. సమాధానం చెప్పకుండా 15 రోజులుగా పంచాయితీ సెక్రటరీలు స్టిక్కర్లు తొలగిస్తూనే ఉన్నారు. స్టిక్కర్లు వేసిన తర్వాత నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల్లో చలనాలు చెల్లించకపోతే తొలగించాలని చట్టం చెబుతుంది. ఎమ్మెల్యే ప్రచారం కోసం వేసిన బెంచీలు, సూచిక బోర్డులు, బ్యానర్లుకు అనుమతులు ఉన్నాయా? 139 పంచాయితీల్లో వైఎస్సార్ పార్టీ దిమ్మెల నిర్మాణం చేపట్టారు. వాటికి అనుమతులు ఉన్నాయా? అనిఅధికారులను
ప్రశ్నించారు.