సాదరంగా ఆహ్వానించిన టిడిపి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్
వరుపుల సత్యప్రభ రాజా
ప్రజా భూమి ప్రత్తిపాడు
ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు సోమవారం వైస్సార్సీపీని వీడి , ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్వరుపుల సత్య ప్రభ రాజా సమక్షంలో టీడీపీ లో చేరారు.వీరందరికి సత్య ప్రభ రాజా టీడీపీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా సత్య ప్రభ రాజా మాట్లాడుతూ పార్టీ కోసం శ్రమించాలి అని , స్థానిక నాయకులతో కలిసి పనిచేయాలి అని, భవిష్యత్ లో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. వైసిపి శ్రేణులైనగుల్లా రమణ, ముడదా శేఖర్, తర్లంపూడి రాజు, ముడదా రామకృష్ణ, ముడదా రాజు, ముడదా అప్పలకొండ, సీకోలి సహదేవుడు,ఈరుళ్ల రాజామణి మొదలగు వారి కుటుంబాలు పార్టీ లో చేరారు.ఈ కార్యక్రంలో వాకపల్లి గ్రామ టిడిపి నాయకులు కురందాసు అప్పలరాజు , గింజాల ఏసుబాబు, కురందాసు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.