స్థానిక పట్టణంలోని వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ కెమిస్ట్రీ మరియు బి.ఎ హిస్టరీ విద్యార్థులు శనివారం వేంపల్లి సమీపంలోని ఆర్.ఎం కిసాన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్.పాలగిరి గ్రామం లోని పరిశోధన క్షేత్రాన్ని సందర్శించారు. కళాశాల రసాయన శాస్త్రం అధ్యాపకులు నాగేంద్ర నేతృత్వంలో కెమిస్ట్రీ ఓనర్స్ మరియు హిస్టరీ హానర్స్ విద్యార్థులు సందర్శించారు. పరిశోధన కేంద్రంలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొనడంతో పాటు అక్కడున్నటువంటి వివిధ ప్రయోగశాలలను సందర్శించి నేటి ఆధునిక కాలంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న అనేక మార్పులను విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు మరియు విద్యార్థులకు నిర్వాహకులు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ప్రయాణ సౌకర్యార్థం శ్రీ చైతన్య హై స్కూల్ కరస్పాండెంట్ బి. చక్రపాణి రెడ్డి స్కూల్ బస్సుని ఏర్పాటు చేశారు. ఈ పరిశోధన కేంద్రం భారతదేశంలోని దాదాపు 16 రాష్ట్రాలల్లో విస్తరించినట్లు నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయం కనుమరుగవుతున్న సందర్భంలో విద్యార్థులకు ఇలాంటి ఆధునిక పరిజ్ఞానాన్ని కల్పించడం ముదావహం అని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ ఓబుల్ రెడ్డి, తెలుగు శాఖ విభాగాధిపతి డాక్టర్ నాగలక్ష్మి, గ్రంథాలయ శాఖ అధిపతి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.