లేపాక్షి: గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ మన అందరి బాధ్యత అని లేపాక్షి ఎస్సై గోపి కంచి సముద్రం గ్రామ ప్రజలకు హిత బోధ చేశారు. జూన్ 4వ తేదీన నాయన పల్లి సమీపంలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారన్నారు .ఈ నేపథ్యంలో మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై గోపి ఆధ్వర్యంలో ఆదివారం కంచి సముద్రంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పోలీసు సిబ్బందితో కలిసి పలు ఇళ్లను సోదా చేశారు .అనంతరం గ్రామస్థులతో ఎస్సై సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంలో ఎలాంటి ఘర్షణలకు చోటు ఇవ్వరాదన్నారు .ఏ పార్టీ నాయకులు ,కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం కానీ, బాణసంచా కాల్చడం చేయ రాదన్నారు. ఎక్కడ ఎలాంటి తగాదాలు జరిగినా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు .ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సరఫుద్దీన్ ,పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.