పులివెందుల :పులివెందుల పట్టణంలోని డాక్టర్ వైయస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శిల్పారామం ఏవో సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మాస్టర్ యువకిషోర్, యువరాజా డ్యాన్సింగ్ స్కూల్, పులివెందుల వారి శిష్య బృందంచే కోలా టం, జానపద మరియు వెస్ట్రన్ నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగిందన్నారు.బుజ్జి బుజ్జి గణప య్య బోజ్జ గణపయ్య(కోలాటం), బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి(కోలాటం), నా అందం చూడు బావయ్యో(జానపదం), నరుడా ఓ నరుడా ఏమి కోరిక, పెళ్లికళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా, ఓ… ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే, అనే పాటలకు పిల్లలు నృత్యాలు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు వేసిన కేకలకు లేక్ దద్దరిల్లిపోయింది అన్నారు.ఈ కార్యక్రమంలో నృత్య శిక్షకుడు మాస్టర్ యువకిషో ర్,స్నేహిత అమృత హస్తం సేవా సమితిఅధ్యక్షుడు రాజు, సిబ్బంది పాల్గొన్నారు.