పులివెందుల
పులివెందుల పట్టణ సమీపంలోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని పరిపాలన అధికారి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గోటూరు చిన్నప్ప సహకా రంతో మాస్టర్ సూర్య, సూర్య డ్యాన్స్ అకాడమీ, మదనపల్లి వారి శిష్య బృందంచే జానపద , వెస్ట్రన్ నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగిం దన్నారు.గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, అదివో అల్లదివో శ్రీహరి వాసము, ఓం మహాప్రాణ దీపం, హే కళ్ళజోడు కాలేజీ పాప జూడు, పుల్సార్ బైక్ మీద రారా, ఎక్కుమామ బండిఎక్కు మామ, హే చుక్కల చున్నీకె నా గుండెను కట్టావే తదితర పాటలకు చిన్నారులునృత్య చేస్తూ ఉంటే సందర్శకులు కేకలు , విలలు,చప్పట్లతో శిల్పారామం దగ్గర వెళ్ళిందన్నారు. ఈ నృత్యప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అన్నారు.ఈ కార్యక్రమంలో పులివెందుల మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గోటూరు చిన్నప్ప, నృత్య శిక్షకుడు సూర్య కుమార్, తదితరులు పాల్గొన్నారు.