ఏలేశ్వరం:-మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లపై అధికారులను మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవిందబాబు ప్రశ్నించారు. సోమవారం కౌన్సిల్ సర్వసాధారణ సమావేశం చైర్ పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన నగర పంచాయతీ కార్యాలయంలో జరిగింది.
నగరపంచాయతీ పరిధిలో పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు అధికారులను నిలదీశారు.ఈ నెల 8వ తేదీన యావత్ భారత దేశమంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే శివరాత్రి పర్వదినాన భక్తులకు ఏలేరు నదీ ప్రాంతంలో కనీస వసతులు కల్పించడంలో ఏలేశ్వరం మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని అన్నారు. బదిరెడ్డి మాట్లాడుతూ ఎటువంటి వసతులు కల్పించకుండా ఎజెండాలలో సుమారు 90000 రూపాయలు బిల్లు పెట్టడంపై ప్రశ్నించారు. పనిచేయకుండా బిల్లులు పెడితే దానికి బాధ్యత అధికారులు వహించవలసి వస్తుందన్నారు.నగర పంచాయతీలో పారిశుద్ధ్య డంపింగ్ యార్డు ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల్లో చెత్త డంపింగ్ చేస్తూ వాటిని తగలబెట్టడంతో పరిసర ప్రాంతాలలో ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని
అధికారులను ఆయన నిలదీశారు. తక్షణమే చెత్త నా ప్రాంతాలను డంపింగ్ చేయడం ఆపకపోతే ధర్నా చేపడం జరుగుతుందని అధికారులను హెచ్చరించారు.15వ వార్డు కౌన్సిలర్ సుంకర హైమావతి మాట్లాడుతూ నగర పంచాయతీలో శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉంటుందని,గత ఐదు ఆరు నెలలుగా పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించిన దాఖలాలు లేవని మండిపడ్డారు.ప్రతి నెల ట్రాక్టర్ కు రూ 60000 రూపాయల చొప్పున 3 ట్రాక్టర్లకు లెక్కలు చూపించడంపై మండిపడ్డారు. గత రెండు నెలలుగా డీజిల్ తదితరు బిల్లులు చూపించాలంటూ కౌన్సిలర్లు నిలదీయగా అధికారులు తడుముకున్నారు.ఇప్పటికైన అధికారులు తీరు మార్చుకుని కనీస అవసరాలైన పారిశుధ్యం,త్రాగునీరు,విద్యుత్ తదితర అంశాలపై దృష్టి సారించాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో అలమండ చలమయ్య,వైస్ చైర్మన్ శిడగం త్రివేణి వెంకటేశ్వరరావు, ముసిరపు బుజ్జి నాగేశ్వరరావు,కౌన్సిలర్లు దలే కిషోర్,కోరాడ సత్యవతి, బలరాం,దిల్బర్ హుస్సేన్,తదితరులు హాజరయ్యారు.