Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంశ్రీనివాసుడు యోగ ముద్రలో ఉన్న క్షేత్రం

శ్రీనివాసుడు యోగ ముద్రలో ఉన్న క్షేత్రం

కూర్చుని ఉన్న ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు గ్రామం ఉంది.ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు. స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు. ఆయన ఎవరో కాదు తిరుమలలోని శ్రీనివాసుడు.ఆ భక్తుడు ఎవరు?స్వామి ఎక్కడ వెలిసారు? ఎల్లప్పుడు నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం.కలియుగదైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశ రాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకొంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరుల పై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు.రత్నఖచితమైన సువర్ణ కళశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలు 

మూడు మండపాలను వంటశాలలను బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతి రోజూ తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు.

శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయ్యింది. ఒక రహస్య స్వరంగ మార్గం గుండా ప్రతి రోజూ తిరుమలకు వెళ్లివచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్లలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నాని మొర పెట్టుకొంటాడు. దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకొంటాడు.

తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరోచేతితో అభయహస్తం కలిగగి ఉండటంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడిగగా ప్రసన్న వేంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చొన్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వేంకటేశ్వరుడు భక్తుకు ర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగ, కపిల తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. ఈ క్షేత్రం తిరుమతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article