కాణిపాకం :చిత్తూరు జిల్లా కాణిపాకం లో వెలసి ఉన్న శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని శుక్రవారం ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రతాప్ స్వామీజీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించి వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సర్వలోకాలకు మొదటి పూజ్యుడు, ఎలాంటి విఘ్నాలు తొలగిపోవాలన్నా స్వయంభుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శనం శుభదాయకమని, ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినానని తెలిపారు.