వైయస్ పెరటి తులసివనంలో మొలచిన గంజాయి మొక్క జగన్
కమలాపురం అసెంబ్లీ ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి గాలి చంద్ర ను గెలిపించండి
కే నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి
కడప సిటీ :
కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వైయస్ షర్మిల, కమలాపురం అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి గాలి చంద్ర లను గెలిపించాలని శనివారం స్థానిక కడపలో సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ షర్మిల గెలిస్తే కేంద్ర మంత్రిఅవుతుందని రాష్ట్రరాజకీయాల్లోపెనుమార్పులు సంభవిస్తాయనివారన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చి తండ్రి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పెరటి తులసి వనంలో పెరిగిన గంజాయి మొక్కని ఆయన విమర్శించారు. కమలాపురం నియోజకవర్గం లో 1952లో దివంగత నేత ఎన్
శివరామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారన్నారు. ఈ ప్రాంతం నుండి పోటీ చేస్తున్న గాలి చంద్ర విద్యార్థి దశ నుండి ప్రజా ఉద్యమానికి అంకితమై ప్రజా పోరాటాలకు నేతృత్వం వహించారన్నారు. ప్రజా సమస్యల పట్ల, ప్రాంతం పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన గాలి చంద్రాను గెలిపించడం ద్వారా నియోజకవర్గం అభివృద్ధి, షర్మిల గెలుపుతో జిల్లా సమగ్ర అభివృద్ధికి సులువు అవుతుందన్నారు.