_ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహబూబ్ బాషా (మాస్)
పెండ్లిమర్రి :శుక్రవారం నుండి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలమ్మ కడప జిల్లాలో మొదలు పెడుతున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పెండ్లిమర్రి మండలం అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా (మాస్) తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీగా పోటీ చేయుచున్న వైయస్ షర్మిలమ్మను అఖండ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని అవి
1) మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం.
2) రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ.
3) రైతు పెట్టుబడి మీద 50% లాభంతో కనీస మద్దతు ధర.
4) పది సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా అమలు.
5) ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం.
6) కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.
7) వృద్ధులకు, వితంతువులకు నెలకు 4000 రూపాయలు, వికలాంగులకు నెలకు 6000 రూపాయలు పెన్షన్.
8) ఉపాధి హామీ పథకం కింద కనీస కూలీ రోజుకు 400 రూపాయలు.
9) రెండు లక్షల 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం. పై 9 గ్యారెంటీ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కావున ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుచున్నాను అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి వేమయ్య, బీసీ నాయకులు చిన్నకోట్ల నాగరాజు, మైనార్టీ నాయకులు ఖాసీం తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.