పెనుకొండ
రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి వంటి కార్యక్రమాల రథసారథి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, మరోసారి ముఖ్యమంత్రి గా గెలిపించుకుందామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. శుక్రవారం పెనుకొండ నియోజకవర్గం లోని సొమందేపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఆమె పర్యటించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని పచ్చ పార్టీలు పచ్చ మీడియా విమర్శించడం తగదు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంచాయతీలలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల భవనాలు, నాడు నేడు కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల భవనాలు పట్టణాలలో నాలుగు లైన్ల రహదారులు మెడికల్ కళాశాలలు, వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్న అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాల వారిని తమ సొంత బిడ్డల్లా ఆదుకోవడం జరిగిందన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలందరినీ కలుస్తామన్నారు. నియోజక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు . సమస్యలు తెలుసుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తానన్నారు. జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు తిరిగి వైసిపి పార్టీకి పట్టం కడతారన్నారు . ఆత్మీయ అలకరింపులో ఆమె వెంట రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర , రమాకాంత్ రెడ్డి, ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, జెడ్పిటిసి అశోక్, కన్వీనర్ నారాయణ రెడ్డి, నాయకులు ఎల్లారెడ్డి, నరసింహమూర్తి, సర్పంచ్ లు అంజినాయక్, గిరిజమ్మ, శ్రీనివాసరెడ్డి , సుధాకర్ రెడ్డి, నాగభూషణరెడ్డి, పుప్పం సుధాకర్ రెడ్డి , దిలీప్ రెడ్డి, గుడిపల్లి కళ్యాణ్, జగదీష్ రెడ్డి, గంగప్ప, లక్ష్మీనరసప్ప, అమరప్ప తదితరులు లు పాల్గొన్నారు.
— మంత్రికి గ్రామ గ్రామాన విశేషాలు
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ శుక్రవారం సోమందే పల్లి మండలంలోని బస్సయ్య గారిపల్లి, నాగినయనిచేరువు, వెలగమాకుల పల్లి, గుడి పల్లి, చిన్నబాబయ్య పల్లి, తుంగొడు, వెలిదడకల, పత్తికుంట పల్లి, పెద్దిరెడ్డి పల్లి గ్రామాలలో పర్యటించారు. ఆమెకు గ్రామ గ్రామాన విశేష ప్రజాదరణ లభించింది. వైసిపి నాయకులు కార్యకర్తలు, మహిళలు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె ప్రసంగాలకు వైసిపి శ్రేణులు పలకింతలయ్యారు. జై జగనన్న జై జై జగనన్న అంటూ చిందులు తొక్కారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు గ్రామ గ్రామాన మహిళలు మంగళహారతులు పట్టారు.