ఏలేశ్వరం:-ప్రజా సమస్యలను వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తున్న ప్రతిపాడు వైకాపా ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు విరుపులు సుబ్బారావు. మండలంలోని రమణయ్యపేట గ్రామంలో సోమవారం గడపగడపకు వైకాపా ప్రభుత్వం కార్యక్రమంలో వరుపుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు సమస్యలను వెలువెత్తారు. దీంతో పరుపుల గ్రామ సర్పంచిని పిలిచి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పరుపుల గడపగడపకు వెళ్లేసరికి అక్కడ ప్రజలు ఆయనకు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా చలమలశేట్టి సునీల్ ను శాసనసభ్యులు సుబ్బారావును ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్ రాజు, మండల వైకాపా ఇన్చార్జ్ ఆడపా పార్థసారథి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.