ఏలేశ్వరం:-
మండలం లోని సిరిపురం గ్రామం లో ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేని మహిళలకు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ చేతుల మీదుగా ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు గ్యాస్ పొందని మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ గ్యాస్ తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం 300 రు సబ్సిడీ కల్పిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కాకినాడ జిల్లా కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్ వెలుగూరి హరే రామ, జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్, మండల అధ్యక్షులు కూరాకుల రాజా, సాపసెట్టి లోవ రాజు, భారత్ గ్యాస్ ఏజెన్సీ అధినేత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.