కదిరి :ఆరోగ్యశ్రీ పథకంలో ఉచిత వైద్య సేవలు పొందలేని ఆరు మండలాలకు చెందిన 23 మంది బాధితులకు రూ. 22 లక్షల 98 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ శుక్రవారం ఆయన కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓవైపు రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదలు ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందుతున్నారని, ఆ పథకం వర్తించని వారికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతో వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం సహాయనిధి ఏర్పాటు చేశారన్నారు. కులమతాలు, పార్టీలకతీతంగా వైసీపీ ప్రభుత్వ పారదర్శక పాలనలో కేవలం సంక్షేమ పథకాలే కాకుండా పేదలను ఆదుకోవడంలోనూ సీఎం జగనన్న ముందుంటారని చెప్పడానికి ఇదొక నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ బి.ఎస్ మక్బూల్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మా కుటుంబాల్లో ఆనందం నింపిన సీఎం జగనన్నకు రుణపడి ఉంటామని చెబుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జిలాన్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.