ఏలేశ్వరం:-కాకినాడ పార్లమెంటరీ వైకాపా అభ్యర్థి చలమలశెట్టి సునీల ను గెలిపించడం మనందరి బాధ్యత అని ఎర్రవరం గ్రామానికి చెందిన వైయస్సార్సీపి యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బుద్ధ గణేష్ ,కాకినాడ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కోప్పన శివ పిలుపునిచ్చారు. వారు శుక్రవారం సునీల్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ
వైయస్ఆర్సీపీ అధిష్టానం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గా నియమించిన సందర్భంగా సన్మానించడం జరిగిందని బుద్ధ గణేష్ అన్నారు. నాపై నమ్మకంతో ఈ పదవి నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి, కాకినాడ పార్లమెంటు సభ్యుడు చలమలశెట్టి సునీల్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల సుబ్బారావుకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా రాయల్ కాపునాడు అధ్యక్షులు అడపా సోమేశ్ మాజీ అన్నవరం ట్రస్ట్ సభ్యులు వాసిరెడ్డి జమీల్ రాష్ట్ర స్వాచ్ భరత్ డైరెక్టర్ బత్తుల సాయిరాం ముత్యాల సతీష్ తదితరులున్నారు.