చాలామంది ప్రజలు ఎంతో కష్టపడి పనిచేసి సంపాదిస్తూ ఉంటారు. అలా ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ కూడా అనుకున్నది సాధించక పోతారు. దీంతో సంపాదించిన డబ్బులు చేతిలో మిగలవు.దీంతో ఆర్థిక కష్టాల్లో ఎదురవుతాయి. అందుకే అపజయాలు ఎదురవుతున్నప్పుడు ఒకసారి వాస్తు ఎలా ఉందో చూసుకోవడం మంచిది. అలాంటి వారు సూర్యాస్తమయం లో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వలన ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని వేద పండితులు చెబుతున్నారు.ఆ పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కష్టపడి డబ్బు సంపాదించడంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ఇక మరికొందరికి వాస్తు ప్రకారం కూడా సరిగ్గా కలిసి రాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందడానికి ఉపయోగపడే కొన్ని పరిహారాలు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి. అయితే ఉదయం, సాయంత్రం సమయాలను ప్రదోశ వేళలుగా పిలుస్తారు.ఈ సమయంలో చేసే శుభకార్యాలు లక్ష్మీదేవి కటాక్షానికి కారణమవుతాయి.అంతేకాకుండా సూర్యోదయ,సూర్యాస్తమయ సమయాల్లో కూడా తప్పకుండా సూర్య నమస్కారం చేయాలి. ఇలా చేయడం వలన సకారాత్మక శక్తి ప్రసారానికి దోహదం చేస్తుంది. అలాగే సాయంకాలం సమయంలో చేసే పూజకు చాలా మహత్తు ఉంటుంది. అందుకే సంధ్యా సమయంలో ఇంట్లో పూజ మందిరంలో, తులసి ముందు దీపం వెలిగించాలి. సూర్యాస్తమయం లో ఇంట్లో దీపం వెలిగించి, ఇంటికి వెలుగును ఆహ్వానించాలి. అలాగే ఇంట్లో ఎప్పుడు చీకటి ప్రవేశించకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే చీకటి నెగిటివ్ ఎనర్జీకి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తే కష్టాలు మొదలవుతాయి. అలాగే ఉదయం సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సాయంకాలం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు. అలా పడుకుంటే లక్ష్మీదేవి అలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పటికీ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలి.