గాజువాక:పెద గంట్యాడ మండలం 74వ వార్డు కోనవానిపాలెం ప్రాధమిక పాఠశాల అనుకోని ఉన్నటువంటి ఖాళీ స్థలం లో నాడు -నేడు నిధులు తో కాంపౌండ్ వాల్ మరియు బోరెవెల్ నిర్మించడం జరిగింది. అలాగే ఆ ఖాళీ స్థలం పాఠశాల అవసరాల కోరకు కేటాయించమని విశాఖపట్నం జిల్లా విద్యాధిశాఖ వారు స్టీల్ ప్లాంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కి లేఖ పంపించారు. ఇప్పుడు అదే స్థలం ను వేరే వ్యక్తి కి కేటాయించడం దుర్మార్గమని.. పిల్లలు భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ నిధులతో అభివృద్ధి చేసినటువంటి స్కూల్ స్థలం ను పాఠశాల కే కేటాయించాలని నిరసన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కోన అప్పలస్వామి, కోన పెంటయ్య, కోన సోమ నాయుడు, ఊరుకోటి అప్పారావు, కోన రమణ , ఊరుకోటి చెన్నయ్య, ఊరుకో టి శ్రీను ,కోన రాజు, కోన అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.