ఘనంగా వాసవి మాతా ఆత్మార్పణ దినోత్సవం
పులివెందుల
పులివెందుల పట్టణంలోని వాసవి కన్యకా పరమే శ్వరి దేవస్థానంలో వైశ్య కులదేవత శ్రీ వాసవి మాతా ఆత్మార్పణ దినోత్సవం ఆదివారం ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు కొత్త రవి ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెల్లవారుజాము న,గణపతి పూజా పుణ్యావచనం,తదితర విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాసవి మాతా విశేష అలంకారంలో, రాత్రి విశ్వ రూప దర్శనంలో దర్శనమిచ్చారని తెలిపారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు దంపతులచే చండీహోమం నిర్వహించారు. అమ్మవారిశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో వాసవి మాతనువదిలారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ వాసవి కన్యకాపరమే శ్వరి దేవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు , స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయిందని తెలిపారు.వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను వాసవి మాతా ఎప్పటికి అజరామరం అయిందన్నారు. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా , శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుందని తెలిపారు.అనంతరం తీర్థ ప్రసాదాలు వినియోగం,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అన్ని సంఘాల నాయకులు మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.