వైసీపీ మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసులరెడ్డి
హనుమంతునిపాడు
మండల కేంద్రమైన హనుమంతునిపాడులో నేడు (06-02-2024) వైస్సార్ ఆసరా నాల్గవ విడత నిధులు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వైస్సార్సీపీ మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైస్సార్ క్రాంతి పథం సెర్ప్ ఆధ్వర్యంలో హనుమంతునిపాడు పాత పెట్రోల్ బంక్ దగ్గర పది గంటలకు కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమములో కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ మరియు కనిగిరి వైసీపీ నూతన ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొంటారని తెలిపారు. మాట తప్పని మడమ తిప్పని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా అక్కా చెల్లెమ్మ లకు చెప్పిన మాట ప్రకారం వరుసగా నాల్గవ సంవత్సరం వైస్సార్ ఆసరా నిధులు విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సీసీలు వివోఏ లు లబ్ధిదారులు ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు వైస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయాల కన్వీనర్లు గృహసారధులు వాలంటీర్లు పాల్గొంటారని తెలిపారు