Sunday, April 20, 2025

Creating liberating content

సినిమాహనుమాన్ రూట్లో హాలీవుడ్ మూవీ.. మంకీ మ్యాన్

హనుమాన్ రూట్లో హాలీవుడ్ మూవీ.. మంకీ మ్యాన్

దేవ్ పటేల్ నటిస్తూ.. దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ.. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే హీరో కథ ఇది. మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు దేవ్ పటేల్. ఈ మూవీతో శోభితా దూళిపాల హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
గత రెండేళ్లుగా ‘మంకీ మ్యాన్’ చిత్రీకరణ సాగుతోంది. దేవ్ పటేల్.. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ ప్లే కూడా తానే ప్లాన్ చేసుకున్నాడు. ‘‘నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’’ అంటూ హీరో చెప్పిన డైలాగ్‌తో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో హనుమంతుడి ఫోటోలు కనిపిస్తాయి. ‘‘రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ’’ అని ‘మంకీ మ్యాన్’ సారాంశాన్ని ఒక డైలాగుతో చెప్పేశాడు హీరో. పెద్ద సిటీలో పేద ప్రజలను ఎవరూ పట్టించుకోరని, అలాంటి వారికి గుర్తింపు కోసం ఫైట్ చేస్తానని దేవ్ పటేల్ ముందుకు వస్తాడు. అదంతా తాను ఎలా చేస్తాడు అనేదే అసలు కథ అని ట్రైలర్‌లో స్పష్టం చేశారు మేకర్స్.
ఇప్పటికే హీరోగా ఎన్నో కంటెంట్ ఉన్న హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు దేవ్ పటేల్. ఇప్పుడు మొదటిసారి ‘మంకీ మ్యాన్’తో డైరెక్టర్‌గా మారాడు. ముంబాయ్ సిటీలో తెరకెక్కించిన ఈ హాలీవుడ్ చిత్రంలో చాలావరకు ఇండియన్ యాక్టర్లనే తీసుకున్నాడు.
‘మంకీ మ్యాన్’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article