హిందూపురం టౌన్
అనంతపురం నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో ఈనెల 10వ తేదీన న్యాయవాదుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరి రామిరెడ్డి తెలిపారు ఇందులో భాగంగా గురువారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో సంబంధిత కరపత్రాలను విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ లేనివిధంగా పెద్ద ఎత్తున న్యాయవాదుల వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వర్క్ షాప్ అటు సీనియర్ ఈ రోజు జూనియర్ న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ వర్క్ షాప్ కు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అమానుల్లా ప్రశాంత్ కుమార్ మిశ్రా విఎన్ భట్ లతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు న్యాయమూర్తులు వెంకట శేష సాయి దుర్గాప్రసాద్ సురేష్ బాబు మన్మథరావు శ్రీనివాస్ రెడ్డి శ్యాంసుందర్ తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు ఈ వర్క్ షాప్ లో న్యాయవాదులకు ఉపయోగపడే ఎన్నో అంశాలపై న్యాయమూర్తులు వివరణాత్మకంగా వివరించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా కేసుల పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర బెయిల్ ఎఫ్ ఐ ఆర్ తదితర అంశాలపై వివరించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని న్యాయవాదులందరూ సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు అనంతరం మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వన్నూరప్ప ఆధ్వర్యంలో రామిరెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు సీనియర్ న్యాయవాదులు రామచంద్రారెడ్డి నరసింహులు సుదర్శన్ సిద్దు పీవీ శ్రీనివాస్ రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.