దళిత బహుజన నాయకుడు జనామాల నాగయ్య పిలుపు
మార్కాపురం
పట్టణంలోని దళిత నేత నీలం నాగేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలపై ప్రభుత్వ అణచివేత, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈనెల 14న జరుగు అధిక జన మహా సంకల్ప సభను జయప్రదం చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేందర్రావు విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు. పేదరికం, అనచివేత, దోపిడీ సామాజిక న్యాయానికి నోచుకోని అధిక జనుల కోసం విజయ్ కుమార్ ఈ సభను ఏర్పాటు చేస్తున్నారన్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర పాలనలో అగ్రకుల మనువాదుల పాలనలో అధిక జనులైన పేదలు ఆకలి, అవిద్య, ఆర్థిక దోపిడీ అధికారానికి దూరంగా అల్లాడుతున్నారన్నారు. అల్ప సంఖ్యాకులుగా ఉన్న అగ్రకుల మనువాదులు అధిక జనులైన వారిని రూపాయి బియ్యం పెన్షన్ల పేరిట మోసం చేస్తున్నారన్నారు. అధిక జనులు ఓట్లు వేసే యంత్రాలుగా మారిపోయి అగ్రకుల జండాలను మోసే ఎన్నికల కూలీలుగా మిగిలిపోయారన్నారు. అధిక జనుల్లో నెలకొన్న ఈ అసంతృప్తిని అస్పృశ్యతను అధికార దోపిడీని అగ్ర కులాల రాజకీయ వ్యాపారాన్ని ప్రత్యక్షంగా ప్రజలతో పంచుకోవడానికి రిటైర్డ్ ఐ ఏ ఎస్ విజయ్ కుమార్ 142 రోజులు 2729 కిలోమీటర్లు గ్రామాలు పట్టణాలలో పర్యటించాడన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక అణచివేత దళితుల దోపిడీ తొ అధికార సామాజిక వర్గం పెట్రేగి పోయిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర పేదలకు స్వేచ్ఛ లేదన్నారు. ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రభుత్వంలో చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వడం లేదన్నారు. దళిత ఓడల్లోని స్కూల్స్ లను విలీనం పేరుతో మూసివేసి స్కూల్ ను విలీనం పేరుతో మూసివేసి దళితులను విద్యకు దూరం చేసిందన్నారు. గతంలో అమలులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాలు అన్నింటిని రద్దు చేసిందని దళితులు ఆవేదన చెందుతుందన్నారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు జైలు నుంచి బయటికి వస్తే దండలు వేసి ఊరేగింపు చేయడం ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేక ఫ్యాక్షన్ కి నిదర్శనం అన్నారు. ఎస్సీ ఎస్టీ బిసి లకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి సైకిల్ కొనుక్కోవడానికి కూడా సబ్సిడీ రుణాలు జగన్ ప్రభుత్వంలో లేవన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ఒక్క పోస్టుకూడా భర్తీ చేయకుండా మరలా మరో ఏడాది పొడిగించడం ఈ ప్రభుత్వం మాయాజాలం అన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో రోడ్లు నీరు స్మశానాల వసతి కూడా లేదన్నారు. దళిత ఎంఎల్ఏ లు, మంత్రులు తమ పదవుల కోసం ప్రభుత్వంతో రాజీ పడిపోఇ డమ్మీలుగా ఈ నేపథ్యంలో అధిక జనులు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అధికారం మరియు బడ్జెట్లో వాటా ఆర్థిక సంక్షేమ నిధుల సాధనకై ఈనెల 14వ తేదీన ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగు అధిక జన మహా సంకల్ప సభ ను జయప్రదం చేయవలసిందిగా నీలం నాగేంద్రరావు విజ్ఞప్తి చేశారు. మార్కాపురం లోని బస్ స్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత హక్కుల పరిరక్షణ సమితి మార్కాపురం డివిజన్ అధ్యక్షుడు జనుమల నాగయ్య అధ్వర్యంలో ఈ సభకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాలపోలు శాంత కుమార్, వి.సి.కె పార్టీ నియోజవర్గ అధ్యక్షులు నూతలపాటి రాజు, వి.సి.కె పార్టీ జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి పులుకురి మే, తపెట్ల శ్రీనివాసులు, జుంజు మహేష్, రెడ్డేపోగు తిమోతి, కాకుమాని రవి తదితరులు పాల్గొన్నారు.