Wednesday, November 27, 2024

Creating liberating content

తాజా వార్తలువైకాపా నుండి టిడిపిలోకి 40 కుటుంబాల చేరిక

వైకాపా నుండి టిడిపిలోకి 40 కుటుంబాల చేరిక

పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి

పులివెందుల(లింగాల)
లింగాల మండలం కామసముద్రం గ్రామంలోవైకాపా నుండి టిడిపిలోకి 40 కుటుంబాలు దేవి రెడ్డి, సంజీవరెడ్డి,విశ్వనాథరెడ్డి, ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన పోతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పోతిరెడ్డి భాను ప్రకాష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి లతో సహా 40 మందికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి టిడిపి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి టిడిపిలో భారీగా చేరెందుకు నియోజకవర్గ వ్యాప్తంగాముందుకు వస్తున్నారన్నా రు.లింగాల మండలం వైకాపాకు పట్టున్న గ్రామం కామసముద్రం ఎంతో కాలంగనో ఫ్యాక్షన్ గ్రామం అన్నారు.ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కొంతమంది తమ స్వార్థం కోసం చిచ్చుపెట్టారు అనికానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి కామసముద్రంలోని చాలా కుటుంబాలు పార్టీలో చేరయి అన్నారు.సోషల్ మీడియా కార్యకర్త లు వర్ర రవి మొదలుకొని ఎంపి అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి అన్నారు.ఇటీవల ఎంపీ పీఏ రాఘవ రెడ్డి 4 ఎకరా ల అటవీ భూమిని ఆక్రమించారని మీడియాతో చెప్పడం కూడా జరిగిందన్నారు.కానీ ఒకే సర్వే నెంబర్లు 26/1/2 అని క్రియేట్ చేసి ఆన్లైన్ కూడా చేసుకున్నారన్నారు.మరోవైపు వివేకా హత్య కేసు లో అప్రూవర్న్ బెదిరించారంటూ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందన్నారు. ఇంకోవైపు ఇతర రాష్ట్రాల్లో నుంచి సంపాదించేందు కు ఎంపీ మనుసులు కార్లు కూడా దొంగతనం చేశారు తెలిపారు.మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ పరువు తీశారు అన్నారు.అమెరికాలో కేసు నమోదు కావడంతో అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీశారన్నారు.ఇవన్నీ చూసి అనేక మంది టిడిపిలో చేరేందుకు సిద్ధంగాఉన్నారన్నారు.
కామసముద్రంలో పార్టీలో చేరిన లాగే లింగాల మండలం మొత్తం ఇదే పరిస్థితి ఉందని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల వ్యాప్తంగా టిడిపి గెలుపొందేలా పార్టీని బలపేతం చేస్తున్నామన్నా రు.ఇప్పుడు చేపట్టిన సభ్యత్వ నమోదులో కూడా లింగాల మండలం మొదటి స్థానంలో నిలిచింది అని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు.రాష్ట్ర అభివృద్ధి చెందాలం టే అది చంద్రబాబు తోనే సాధ్యమవుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article