భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టిస్తున్నాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ కొత్త చరిత్ర లిఖించాడు. ఇప్పటి వరకు ఈ ఘనత చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు పడగొట్టగా ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. అశ్విన్ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీరిద్దరి తరువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై ఇప్పటి వరకు ఏ టీమ్ఇండియా బౌలర్ కూడా వంద వికెట్లు తీయలేదు. అశ్విన్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ పై 98 వికెట్లు తీశాడు. అతడు మరో 2 వికెట్లు గనుక తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇక రెండు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా జేమ్స్ అండర్స్‌న్ ఉన్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు పడగొట్టాడు.
ఈ జాబితాలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. మురళీ ధరన్ కేవలం 87 టెస్టుల్లో 500 వికెట్లు తీశాడు. భారత్ నుంచి 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ జాబితాలో భారత్ నుంచి అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాతి స్థానంలో అశ్విన్ నిలిచాడు. 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆటగాడిగా అశ్విన్ రికార్డుల్లోకి ఎక్కాడు.