వంట నూనెలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. మనం నిత్యం వంటల్లో ఉపయోగించే వివిధ రకాల వంట నూనెలే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటాయి. ఇలాంటివి 6 రకాల వంట నూనెలు ఉన్నాయి. వీటిలో రిఫైండ్ ఆయిల్ ఒకటి. నూటికి 80 మంది వాడేది ఇదే. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మనం ఇంట్లో వాడే రిఫైండ్ ఆయిల్ కంపెనీ ఏదైనా సరే ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. బాగా ప్రోసెస్ చేసిన తరువాత రిఫైండ్ ఆయిల్ తయారవుతుంది. అంతేకాకుండా వాసన,రుచి లేకుండా ఉండేందుకు ఇందులో కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. రిఫైన్ చేసే క్రమంలో ఆయిల్‌ను అదిక ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. దాంతో అందులో ఉండే న్యూట్రియంట్లు అన్నీ నిర్మూలమైపోతాయి. కొవ్వు పెరుగుతుంది. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ సంఖ్య పెరిగిపోతుంది. రిఫైన్ అయిల్ అనేది శరీరంలో విష పదార్ధాలకు కారణమౌతుంది. ఫలితంగా క్రమం తప్పకుండా రిఫైండ్ ఆయిల్ వాడేవారిలో కేన్సర్, డయాబెటిస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వ్యాధి, ఎథెరోస్కెలేరోసిస్ , స్థూలకాయం, ఫెర్టిలిటీ సమస్య, ఇమ్యూనిటీ లోపం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆరు రకాల రిఫైండ్ ఆయిల్స్ వినియోగించకూడదు.
కిచెన్ నుంచి దూరం చేయాల్సిన 6 రకాల వంట నూనెలు
రైస్ బ్రౌన్ ఆయిల్, పీనట్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, క్యానోలా ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కార్న్ ఆయిల్. ఈ ఆరు రకాల నూనెల్ని వాడటం తక్షణం మానేయడం మంచిది. వీటి స్థానంలో ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నెయ్యి వాడటం మంచిది. లేకపోతే మీ రక్త నాళాల్లో చెడు పదార్ధాలు, కొవ్వు పేరుకుపోతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి.