టీడీపీలో చేరిన సర్పంచ్ సుధాకర్
తుని :ఆఒడ్డున ఉంటావా..ఈ ఒడ్డుకు వస్తావా….అని అంటే ఠక్కున బదులిస్తున్నారూ జనం.తగ్గేదేలే..మా ధ్యాస..శ్వాస..యనమలే అంటున్నారు.ఇది జన నాడి,జనవాని అందుకే జనం యనమల చెంతకు వస్తున్నారు. వైకాపా నేతలు
సైతం సైకిలెక్కి యనమల దివ్యనుగెలుపు బండెక్కిస్తామంటున్నారు.
అంతెందుకు తొండంగి మండలం కొత్తపాకల యనమల పల్లవి ఆలపించింది.తెలుగు దేశానికి కొరకరాని కొయ్యగా ఉన్న కొత్త పాకల ఇప్పుడు కోనతో అడుగులు కలిపింది.మీలాగే మేము యనమల తోనే ఉంటామని సర్పంచ్ అంగులూరి సుధాకర్ అనుచరగణం యనమలకు జై కొట్టి పసుపు కండువాలు కప్పుకున్నారు.మారిన రాజకీయ సమీకరణాలతో తీర గ్రామాల్లో అధికార పార్టీకి చోటే లేదు.మండల టిడిపి అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన కొత్తపాకలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య …. సర్పంచ్ అంగులూరి సుధాకర్ గ్రామపెద్దలు,యువజనులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.వీరందరికిపసుపు కండువాలు కప్పిన యనమల రామకృష్ణుడు,యనమల దివ్య కొత్త పాఠాలు ప్రజల మార్పుశుభపరిణామమన్నారు.సెంట్ పర్సెంట్ దళితులున్న కొత్తపాకలప్రజల్లో వైకాపా అరాచక పాలనపైచిర్రెత్తి చంద్రబాబు సుపరిపాలన
కోసం ఎదురు చూస్తున్నామని, విజన్ ఉన్న జననేత్రి యనమల దివ్య వెంట నడుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బోడపాటి అప్పారావు, సోమాల ప్రసాద్, పెయ్యల సూర్యారావు, కోనాల రాములు, బోడపాటి శేఖర్, పిల్లి బాబ్జి, బూర్తి సింహాచలం, బూర్తి కృష్ణ, డొక్కమల్ల బాబురావు, బండి చిట్టిబాబు, పెదపూడి గరయ్య, నేపాకృష్ణ, మాట్లాడుతూ వైకాపా దుష్టపాలనపై నిప్పులు చెరిగారు, కాస్కో జగన్ రెడ్డి మేము సిద్ధం నిన్నూ నీపార్టీని ఓడించడానికి సిద్దం..ఇది దళితుల శపధమని
హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు యనమల రాజేష్, చోడిశెట్టి గణేష్, వెలుగుల గోపాలకృష్ణ, బెండపూడి నాయుడు, ఆకెళ్ల శాస్త్రి, సీనియర్ నాయకులు ఎస్ఎల్ రాజు, మోతుకూరి వెంకటేష్, చింతంనీడి అబ్బాయి ,కాపు యువ నాయకులు పప్పు నవీన్,దూలం మురళి, బంటుపల్లి అన్వేష్ తో పాటు కొయ్యా కేశవ్, చొక్కా కాశీ తదితరులు పాల్గొన్నారు