Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలువెలంపల్లి గారు ఓ సారి ఆలోచించరూ…!

వెలంపల్లి గారు ఓ సారి ఆలోచించరూ…!

మీ సీటు గల్లంతు కానుందా?
పార్టీ పునరాలోచనలో పడిందా
ఆయన అనుచరులే ఎసరు పెడుతున్నారా
మల్లాది మౌనం శాపంగా మారిందా
సీటు మార్చితే ఖర్చుపెట్టిన కాసులు తుస్సేనా
ఆయన వర్గం ముఠాలు ఉన్నాయా
ఆ ముఠాలే మూటలు వెనక్కి తెప్పిస్తారా
అసలు ముఠాలు ఎందుకు ఉంటాయి…ఎందుకు ఉండాలి
ప్రజల్ని బెదిరించెందుకే టీమ్ ఉన్నారా
ఆ నేత కీ రోల్ పోషిస్తున్నాడా
వెలంపల్లిని డామేజ్ చేస్తున్నది వారేనా
సింగ్ నగర్లో వెలుగు చూసింది నిజమేనా
అంతా ఆ అన్న వర్గంతోనే పేరు పోతుందా

అమరావతి:రోజులు సమీపిస్తున్నాయి.నేతల రాతలు,తలరాతలు మార్చడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు.58 నెలల పాలనలో పాలకుల పాప పుణ్యాలు, ప్రతిపక్షాల పాత్రపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు…ఇంకా 30రోజులు సమయం ఉంది. క్షణం ఒక యుగంలా భావించి మరో సారి తమకు అదృష్టం వరిస్తుందా లేదా అన్న సందిగ్దములో ఉన్నారు.అయితే ప్రజాసేవ ముసుగులో నేతలు చేసిన ఘనకార్యాలు,నేతల వెనుకున్న చోటా నాయకులు చేసిన అకృత్యాలు, దందాలు బెదిరింపులు అన్నీ కూడా ఇప్పుడు ప్రజా క్షేత్రంలో రుచిచూడక తప్పదు.ఇలాంటి పరిస్థితి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గములో చోటు చేసుకోబోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవీ కాలంలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము కదా ప్రజల్లో తన పట్ల,తన పరిపాలన పట్ల ప్రజలు ప్రగాఢ విశ్వాసం తో ఉన్నారని విశ్వసించి అభ్యర్థుల మార్పు చేపట్టారు.అది శుభపరిణామం, ఆయన పాలన పై ఉన్న నమ్మకం. కాని పూర్తిస్థాయిలో అధినేత పై ఉన్న అభిమానాలతోనే ఇక్కడి నేతలు గెలిచి తీరుతారన్నది కూడా కొంచెం ఆలోచించాల్సిన అంశమే.ఎందుకంటే రాజు మంచివాడైనా ప్రజలకు అందుబాటులో ఉండే నేతలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.రాజు మంచి చెడులు రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. కానీ నియోజకవర్గ పరిధిలో నిత్యం ప్రజల కష్ట శుఖాలు చూడ వలసిన వాడు తన అనుచరులతో అనేక ఇబ్బందులు గురిచేస్తుంటే ఆ ఫలితం కచ్చితంగా రుచిచూడక తప్పదు గా.ఇక్కడ వెలంపల్లి పరిస్థితి అలాగే ఉందని చెప్పాలి. ఎన్నికలకు ముందు మల్లాది చాలా మంచివాడు, గడప గడపకి వచ్చినప్పుడు బ్రహ్మరథం, ఎన్నికలు సమీపించి సీట్ల ఖరారు అయ్యే సమయంలో మల్లాది మంచివాడు కాకుండా పోయాడు.ఎలా ఇది…ఇదంతా కేవలం అధికారం ఉన్నప్పుడు నేతల లెక్కలేనితనం.అయితే ఇక్కడ వెలంపల్లి విషయంలో అయన వెనుక ఉండి ఓహో ఆహా అంటున్న వారే ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత తెప్పించే కార్యక్రమం చేస్తున్నారు.ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతుంటాయి.ఏ నిర్మాణం కూడా నూటికి నూరు శాతం సక్రమంగా ఉండదు.ఇది జగమెరిగిన సత్యం. అయితే అక్రమ నిర్మాణాలకు ప్లాన్ ఇచ్చేది ,వాటికి అనుమతులు ఇప్పించేది,అనుమతులు ఉన్నట్లు చూపించి అప్పనంగా దండుకునేది అంత ఇక్కడి వారే.ఇన్ని అరాచకాలు చేస్తూ మేము ఫోన్ చెస్తే వెలంపల్లి వర్గంలో ముఠాలు ఉన్నాయి వారు వచ్చి అది చేస్తారు ఇది చేస్తారని చెప్పేది వీరే.ప్రజలు ఎప్పుడూ తమ వ్యతిరేకత ఇలాంటి సందర్భాల్లో నే చూపిస్తారు. ఇందులో నిజంగా నేతల ప్రమేయం ఉందా అంటే ఖచ్చితత్వం లేదు.చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ లు చాలా ఉన్నాయి..ఉంటున్నాయి కూడా…కాబట్టి అలాంటి వారి వల్ల తమ పరిధిలో తమ ప్రమేయం లేకపోయినా వారి అనుచరులు చేసిన పాప పుణ్యాల ఫలితం అనుభవించక తప్పడంలేదు. ఇలాంటి ఘటన సింగ్ నగర్ లో వెలంపల్లి పేరు చెప్పి ఓ చోటా నేత చేసిన వీరంగంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇలాంటివి ఇంకెన్ని వస్తాయో రోజులు సమీపిస్తున్న కొలది వేచిచూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article