ప్రజా సంక్షేమం సరే…మీ క్షేమం కూడా ముఖ్యమే కదా
భద్రతా వైఫల్యం పూర్తిగా ఉన్నట్లేనా…
ముఖ్యమంత్రి కే దిక్కులేకపోతే ఎలా
నిఘా వర్గాలు వైఫల్యం చెందయా..
ఈ దాడి జగన్ పై వ్యతిరేకతతోనా.. వెలంపల్లి పై వ్యతి రేకతతోనా…
జగన్ పై దాడి తో బొండాసీటు చిరిగినట్లేనా
వెలంపల్లి కి ప్రాణగండం..ఓటమి గండం తప్పినట్లే నా
ఆందోళనలో వైసీపీ వర్గాలు.. అవహేళన లో విపక్షాలు…
అమరావతి:
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై శనివారం రాత్రి విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో రాయి దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ కు గాయాలయ్యాయి. రెండు కుట్లు కూడా పడ్డాయి.
నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లి కూడా ఈ దాడిలో గాయాలయ్యాయి. అయితే స్వయాన ముఖ్యమంత్రి పైనే ఈ దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అటు జాతీయ స్థాయిలోకూడా ఈ పరిణామాలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.కేంద్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయి వివరాలు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఇవన్నీ బాగున్నా…అసలు ఈ దాడి చేసింది ఎవరు..ఎందుకు చేశారు అన్నది ఇప్పుడు ప్రధాన సమస్య.దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విదంగా ఉదహరిస్తున్నారు.అధికార పార్టీ వారు జగన్ పై హత్యాయత్నం చేసారని విపక్షాలు మరో కోడి కత్తి డ్రామా అని అంటున్నారు.అయితే ఏది నిజం ఏది అబద్ధం అన్నది కాసేపు ప్రక్కన పెడితే ముఖ్యమంత్రి పట్ల పోలీసు, నిఘా వర్గాల వైఫల్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నాడు జరిగిన కోడి కత్తి కేసు అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి భద్రత దృష్ట్యా కొంచె ము ఆలోచించాల్సి వస్తుంది.కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి.ముందస్తు ప్రకారం రూట్ మ్యాప్ ఉంటుంది నిఘావర్గాలు, ప్రత్యేక బృందాలు అనునిత్యం డేగ కళ్ళతో ఉండాలి. కానీ ఇక్కడ అదేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా వైఫల్యం కారణంగా ఈ దాడి జరిగిందా లేక ప్లాన్ ప్రకారం జరిగిందా అనుమానం బలంగా వినిపిస్తోంది.దీనికి తోడు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కరెంట్ కోతలు కూడా ఓ విధమైన అనుమానం కలిగిస్తున్నాయి.ముఖ్యమంత్రి పర్యటన నేపద్యంలో ముందు రోజే సెక్యూరిటీ అధికారులు ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఇలా దాడి జరగడం అందరికి అనేక రకాల అనుమానం రేకిస్తున్నాయి.ఈ దాడి ముఖ్యమంత్రి పై కావాలని చేశారా లేక స్థానిక అభ్యర్థి మీద వ్యతిరేకతో చేసారా అన్న కోణంలో రక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వెలంపల్లి మీద ఆయన వర్గం మీద కొంత వ్యతిరేకత ఉంది. అందులో నియోజకవర్గ మార్పు కూడా ఓ కారణం కావచ్చు.ఏది ఏమైనా ముఖ్యమంత్రి మీద దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుప్రమాదం గా మారిందా అన్న మీమాంసకు దారితీస్తోంది. దీంతో వైసీపీ వర్గాలు జగనన్న జరభద్రం అంటూ స్లొగన్స్ వినిపిస్తున్నారు.