ప్రజానేతకు ప్రాణహాని ఎందుకు వచ్చింది..
నేతల తప్పిదాలే… అధినేతకు ముప్పుతెచ్చిపెట్టిందా
వెలంపల్లి సీటు ఇవ్వడమే జగన్ చేసిన నేరమా
వెలంపల్లి వర్గం అగడాలే ప్రజానేతకు ప్రాణం మీదికి తెచ్చిందా
సెంట్రల్ నేతల అక్రమాలే ఇలా చేసాయా..
వీరి అక్రమాలకు పై వారు బాధ్యత వహించాలా…
గురితప్పింది… లేదంటే అధినేత గతి ఏమిటీ..
అమరావతి:
ఓ వైపు తండ్రి మరణం,మరోవైపు అక్రమ కేసులు 16 నెలలు జైలు శిక్ష.నేరం జరిగిందో లేదో పూర్తిస్థాయి నిర్దారణ కాలేదు అయినా అనేక కష్ట నష్టాలు ఓర్చుకుని ఒక్కడై ఒంటి చేత్తో పార్టీ ని బ్రతికించు కుని నెరవేరని హామీలు ఇవ్వలేక ప్రతిపక్షం లో ఉన్నా ..పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయింపు చేసినా.. అదరక బెదరక ఎండ వాన గాలిని సైతం లెక్క చేయక ప్రజా పోరాటం చేసి ప్రజల ఆశీస్సులు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ప్రపంచ మహమ్మారి కరోన ప్రజల జీవితాన్ని చిన్నా భిన్నం చేసినా.. ప్రభుత్వ ఖజానాలో రెవెన్యూ లోటు ఉన్నా.. ప్రజాసంక్షేమము మరవకుండా పాలన సాగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచే నియోజకవర్గ స్థాయిలో ప్రజల బాధలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకరండి అని ప్రజనేతగా గొంతెత్తి మొత్తుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే ప్రజా సమస్యలపై శ్రద్ధ లేని నేతలు అక్రమ సంపాదనకు ఆరాటపడటం మొదలు పెట్టి అనేక అక్రమాలు చేస్తూ ,అందిన కాడికి దోచుకోవడానికి తమ అనుచరులను ప్రోత్సహిస్తూ కాలం వెళ్లబుచ్చారు.వెరసి నేతలు చేసిన పాపాలు అధినేత మెడకు చుట్టుకుని చివరికి ఆయన ప్రాణంకు కూడా రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఏమిటీ, పేద ప్రజలకు దాదాపు 2లక్షల 50వేల కోట్ల రూపాయలు అనేక సంక్షేమ పథకాలు అందించటమేనా.. కాదుగా..ఎప్పుడూ నా పేద ప్రజలు అని ప్రజా సంక్షేమం కోరుకునే యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని చేసే సాహసం చేశారంటే కొంచెం ఆలోచించాలని మేధావులు అంటున్నారు. కేవలం స్థానిక నేతలు గడప గడప కార్యక్రమంలో ప్రజలపై మండిపడటం,గర్జించడడం జులుం ప్రదర్శించడం వంటివి చేయడం వల్లే కొంతమంది ఆకతాయిలు ఇలా చేయడం గురితప్పి అధినేతకు ముప్పు వాటిల్లిందని కొన్ని వర్గాల నుండి వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తూ సామాన్యుడిని హక్కున చేర్చుకుంటుంటే.. ఇలాంటి దుచ్చర్యలకు ఆయన మీదే పాల్పడే విధంగా చేయరని మరోవైపు కొంతమంది చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇక్కడి నేతలు అవినీతి అక్రమాలు,ఆగడాలు సహించలేని వారు ఇలా చేసారా లేక దురుద్దేశ్యపూర్వకంగా చేశారా అన్నది తేలాల్సివుంది.