Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఅవార్డులు కావాలా అయితే కౌతాళం వచ్చేయొచ్..

అవార్డులు కావాలా అయితే కౌతాళం వచ్చేయొచ్..

కళ అంటే ఏమిటో తెలియకపోయినా …
కళా సంస్థల అధినేతలు అయ్యారు…అవుతున్నారు..
కళావాచస్పతి అంటే అర్థం తెలియదు…
ఆయన బిరుదు ఇవ్వడం.. ఈయన బిరుదు తీసుకోవడం…
కళలో ఆరితేరిన జగ్గయ్య వీరు ఒక్కటేనా…
అభినవ భావాలు కావాలా అయితే ఓకే…
గాన గంధర్వ కావాలా ఊ…రెడీ…
మీ దగ్గర కళ ఉందా…కాసులున్నాయా…
కళ ఉంటే ఊహు…కాసులుంటేనే ఊ…
ఇదే ఇక్కడి కళా సంస్థల తీరు..
లోపాలున్నాయంటే లేపేస్తాం…కోర్టుకీడుస్తాం…
కళ నెత్తికెక్కిందా…కాసులు కిక్కుస్తున్నాయా…
కారు కూతలు కూస్తే తప్పులు ఒప్పులవుతాయా…
ఇందుకేనా కౌతాపూర్ణానంద కళా వేదిక ఉండేది ..
కౌతా నిర్వాహకులకు ఇవి పట్టవా…తెలిసినా పట్టించుకోరా…

అమరావతి:
సంగీత స్వరాలు ఓల లాడించా లంటే ఓ వరం.ఆ సరస్వతీదేవి ఎవరిని వరిస్తుందో చెప్పడానికి అలివికాదు. సంగీతానికి రాళ్లు కూడా కరిగిపోతాయనే సామెత పూర్వము నుండి నానుడి లో ఉంది.అంటే ఎంతటి కఠిన పాశాన హృదయాలయిన పాట వింటే పరవశించి పోతారన్నది అర్థం.అందుకే దేవతలు కూడా ఓ సందర్భంలో తమలో తాము లయబద్ధులై నాట్యమాడుతారన్న విషయాలు కూడా సినిమా ద్వారా యావత్ ప్రపంచానికి తెలియపరిచింది.రాజులు కూడా తమ మానసిక ఉల్లాసం కోసం ప్రత్యేకంగా కళా వేదికలు ఏర్పాటు చేసుకున్నట్లు కూడా చరిత్ర చెబుతోంది. ఇలాంటి మహత్తర సన్నివేశాలు అన్నీ కూడా అలనాటి నటీనటులు, గాయని గాయకులు తమ పాండిత్యాన్ని జోడించి అద్భుతమైన స్వరగానార్చన చేసి ప్రేక్షకులకు ఎంతో కనువిందు చేసేవారు. తెలుగు లోకానికి అపార మధురానుభూతిని కలిగించడానికి మహనీయులు ఘంటసాల పడిన తపన వర్ణించడానికి వీలుకానిది.ఓ మంగళం పల్లి బాలమురళి కృష్ణ, జానకీ, సుశీల ,జేసుదాసు,sp బాలసుబ్రహ్మణ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గాన గంధర్వులు,గానకోకిలలు ఒక చోట ఏమిటీ అనేక చోట్ల తమ గానామృతాన్ని వినిపించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చారిత్రాత్మక సినిమాలు చూస్తే విశ్వనాధం గారు సంగీతములో చేసిన కృషి అమోఘం అనిర్వచనీయమైనది.లయబద్ధమైన పాట పాడితే సృష్టి లయకారుడు కూడా ప్రత్యక్షమై మోక్షం ప్రసాదించినట్లు శంకరాభరణం సినిమాలో చూపించారు.అదే విదంగా దేవుడు ఇలా ఉంటాడు, రాజులు ఇలా ఉంటారని చూపించిన మహనీయులు అక్కినేని, జగ్గయ్య, ఎస్వీ పాండురంగారావు, నందమూరి తారకరామారావు ఇంకా ఎంతో మంది మహనాభావులు ఉన్నారు.వారు చేసిన అశేష,అచంచలమైన కృషికి అప్పట్లో కళావాచస్పతి, గానగంధర్వులు, గానకోకిల ఇలా పలు రకాల భక్తి పూర్వక బిరుదులు ఇచ్చి వారిని ఆనాటి పెద్దలు గౌరవ సత్కారం చేశారు.అంతటి త్యాగం, కఠోర శ్రమ,వారి జీవితాలనే ఫణంగా పెట్టి కళామతల్లి ఒడిలోనే ఎదిగి ఒదిగిపోయిన కళామతల్లి బిడ్డలను కించపరిచే విధంగా నేడు కొంతమంది తయారవ్వడం కళామతల్లి బిడ్డలు చేసుకున్న దౌర్భాగ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కళను ప్రోత్సహించడం ఎంతో అదృష్టం కానీ కౌతాళం వేదికగా జరుగుతున్న తీరే బాధాకరం వేస్తోంది.మరి ఈ దుస్థితి నుంచి కళామతల్లి కి కొంతమేరైనా ఉపశమనం కలుగుతుందేమో వేచి చూద్దాం…మరిన్ని పూర్తి వివరాలు వచ్చే సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article