గెలిపించాలని దివ్యమ్మనూ
యువనేత పప్పు నవీన్ పిలుపు
తుని :అభివృద్ధి సంక్షేమ పథకాలకు
సమ ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని యువ నేత పప్పు నవీన్ పప్పు నవీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. తుని మండలం
టి వెంకటాపురంలో ఉమ్మడి అభ్యర్థులు యనమల దివ్య
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లకు మద్దతుగా జనసేన టిడిపి బిజెపి శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన క్యాలెండర్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన ఆయన, ప్రతి నిరుపేద ఆర్థిక పురోభివృద్ధికి సూపర్ సిక్స్ పథకాలు దోహదపడతాయన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంతో పాటు చదువుకునే ఆడపిల్లలకు ఏడాదికి 15 వేల రూపాయలు, రైతు సుఖీభవ కింద వ్యవసాయ పెట్టుబడులకు 20 వేల రూపాయలు, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తారని పప్పు నవీన్ ఈ సందర్భంగా తెలిపారు.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు