Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుకళామతల్లి సిగ్గుపడుతోంది…

కళామతల్లి సిగ్గుపడుతోంది…

చీ…చీ… సిగ్గు…సిగ్గు….నిస్సిగ్గు
కాసులకోసం కక్కుర్తి…
కళామతల్లి ముసుగులో అక్రమాలు
ఒక్కొక్కరుగా పెదవి విప్పుతున్న వైనం
అంతా ఆ సీనియర్ దే హవా,పెత్తనం
ఊరు గొప్ప పేరు దిబ్బ చందంగా
పెద్దల పేరు చెప్పి పేదలపై పెత్తనాలు
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొంటున్నది నిజమేనా…
అవార్డులు, రివార్డులతో దోచుకోవడం ఆ అధినేత పనేనా
గాడిద స్వరము…కాకీ రాగాల వారున్నారా
అయితే వీరు గాయనీ గాయకులు కాదా..
అచ్చర్యానికి గురిచేస్తున్న డా.యు.వి రత్నం చెప్పిన అక్షర సత్యాలు
ప్రజాభూమి సత్య శోధన నిజమేగా…
మరి వాస్తవాలు వెల్లడిచేస్తే కారు కూతలేల
ఊకదంపుడు ప్రసంగాలు,ఉత్తుత్తి మాటలేల
చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది ఇలానా..
అక్షరం ముక్కరాక పోయిన అంతా బిల్డప్ ఎలా
ఎవరి కోసం ఈ పాడుపనులు
చేసేది చెత్తపనులు మళ్లీ చిలకపలుకులా
చదివింది అరచదువు… ఆపై జర్నలిజానికే కొత్త అర్థం..

నిన్న కారుమంచి రాజు,మాంతి రమణ,నేడు పరుచూరి,రూపాసత్యశ్రీ, నేడు యు.వి రత్నం..రేపు ఇంకెవరో…

విజయవాడ:
ప్రాచీన కాలం నుండి కళలకు ఎంతో ఆదరణ ఉంది అనగద్రొక్కిన సందర్భాలు ఉన్నాయి.నాడు స్వరం లేక ఎదుటి వారి స్వర మాధుర్యాన్ని జీర్ణించుకోలేక ఎన్నో కుట్రలు చేసేవారు అందుకు తార్కాణ ముగా అనేక సినిమాల్లో చూపించడం జరుగుతూ వస్తుంది. అయితే ఆ సంఘటనలు కూడా కేవలం జ్ఞానోదయం కోసం కళను ఎవరు కించపరిచిన, అవహేళన చేసిన చిన్న చూపు చూసిన చివరికి కళామతల్లి ఎవరిని వరించాలో ఎవరి గానం చేత పరిపూర్ణత వస్తుందో కళ్ళకు కట్టినట్లు చూపించేవారు.అవన్నీ కూడా యదార్ధ సంఘటనలు. సాధకుని చిత్తము,ఏకాగ్రత ప్రామాణికంగా కళామతల్లి వరిస్తుందనేది పూర్వం నుండి వినికిడి. నాడు కాసులంకోసం కాకుండా కేవలం పేద ధనిక, కులం వర్ణం అనే అహంభావంతో ప్రవర్తించే వారు.అలాంటి దృశ్యాలు సాగరసంగమం ,శృతిలయలు సరిగమలు, స్వాతికిరణం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు చిత్రాల ద్వారా కళామతల్లి ముసుగులో పాడు పనులు,తక్కువ ఎక్కువ అనే భేదభావాలపై చైతన్య పరిచేవారు.కానీ ఎన్ని విధాలుగా ఎన్నో చిత్రాల ద్వారా కనువిప్పు కలిగించిన ఈ అధినిక కాలంలో సిగ్గు ఎగ్గు లేకుండా వారి స్వలభం కోసం సంస్థలను కొంతమంది ఏర్పాటు చేసుకుని స్వరం, గానం, లయ ఇవేమీ తెలియక పోయిన, అసలు ఆ గాత్రమలో మాధుర్యం ఉందొ లేదో వారికి తెలిసిన మమ్మలి ప్రశ్నించె వారు ఎవరు లేరు అన్న మితి మీరిన పొగరు కావచ్చు,వారికి ఉన్న పలుకుబడి,ఏలుబడితో స్వరాలను వారి ఇష్టానుసారంగా, రాగాలను వారికి అనుకూలంగా ట్రాక్ లు పెట్టుకుని పాటలు పాడుతూ గాన గంధర్వులు, అభినవ భాలు,మరో జేసుదాస్, జాతీయ అంతర్జాతీయ గాయనీ గాయకులమంటూ గొప్పలు చెప్పుకుంటూ వీరికి వీరే బిరుదులను అలంకరించుకుని విర్రవీగుతున్నారు.
కళ ఓ వరం. కళామతల్లి కరుణ అందరికి దక్కదు. అది కాసులిచ్చి కొనుక్కునేది కాదు. కానీ ఇక్కడ కొందరు అసలు దేనికోసం ఈ కళారంగాన్ని ఎంచుకున్నారో దానివేనుక ఉన్న అర్థం పర మార్థం వేరు.బైటికి మాత్రం కళామతల్లి బ్రతికించుటకు మాత్రమే తమ జీవితాలను త్యాగం చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కొంతమంది పెద్దల తెలిసి ఉండచ్చు,వీరి గురించి వారికి పూర్తిగా తెలియకపోవచ్చు వారి దగ్గర మంచిగా ఉంటేనే సరిపోదుగా ఆత్మపరిశీలన లో అనేక వాస్తవ, అవాస్తవాలు తెలుస్తాయి కదా.అవన్నీ ఓ వైపు పెట్టి మరో వైపు శ్రీరంగనీతులు చెబుతూ మరో వైపు చెత్త పలుకు లు పలుకుతూ ఆస్తులు, అప్పులు పాలు అయ్యామని చెప్పుకుంటూ పబ్బం గడపుకోవడం పరిపాటిగా మారింది.
ఓ కళాసంస్థ అధినేత మోనోపోలిలాగా అందరిని శాసించే స్థాయికి ఎదిగి నందిని పంది, పందిని చేస్తూ పత్రికలలో ప్రగల్బాలు పలుకుతూ ఆ ప్రకటనలు చూపించు కొని పబ్బం గడుపుకుంటూ పెత్తందారీ వ్యవస్థని ఏర్పాటు చేస్తే అందుకు కొంతమంది గొప్ప గాయకులమని మెడలో బోర్డ్ వేసుకున్న వారు ఆహా ఓహో అంటు పూట గడుపుకుంటూ పేద కళాకారుల పొట్టకొడుతున్నట్లు కూడా బహిరంగంగా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రజాభూమి pbtv సత్యశోధన మొదలు పెట్టింది.అనేక కఠోర వాస్తవాలు వెల్లడి చేస్తూ నిజాలు నిర్భయంగా రాస్తూ వస్తోంది. కళాసంస్థల తీరుపై విమర్శలు చేస్తూ కొంతమేర కట్టడి చేయాలని తలంచిన ఒమ్మిరఘురాం కూడా అనేక విషయాలు వెల్లడి చేశారు అప్పట్లో.అయితే ఆయన లేక పోవడం కూడా ఇలాంటి వారికి కలిసి వచ్చినట్లుగా భావిస్తున్నారు.
ఇదే క్రమంలో ప్రజాభూమి కి బాసటగా మొదటగా కారుమంచి రాజు,మాంతి రామణలు నిలిచారు ఆ తరువాత సీనియర్ కళాసంస్థ అధినేత పరుచూరి విజయలక్ష్మి కూడా ప్రజాభూమి ని అభినందించారు. ఆ తరువాత గాయనీ రూపాసత్యశ్రీ స్పందించారు. అయితే జాతీయ స్థాయిలో కళావేదికలు ఏర్పాటు చేసి దాదాపు పదహారు డాక్టరేట్ లు పొందిన యు.వి రత్నం నేడు ఘాటుగా స్పందించడం పేదకళాకారులకు సంబ్రాచ్చర్యానికి గురిచేస్తోంది.నటుడు, గాయకుడు, పాత్రికేయడు ఉంటూ కౌతాపూర్ణానంద ధర్మ సత్రంలో అనేక ఇక్కట్లు పడుతున్న నక్షత్ర కళా వేదిక అధినేత వాట్సప్ గ్రూప్ లో స్వరగానార్చన గాణలహరి సంగీత విభావరి కళాసంస్థ అధినేత యు.వి రత్నం సంచలన ఆరోపణలు గుప్పించడం కళా సంస్థల తీరు ఎలా ఉందో అర్ధం అవుతోంది. అచ్చర్యానికి గురిచేస్తోంది.ఆవేదన కలిగిస్తోంది. ఆయన సారాంశం ఆయన చెప్పిన విదంగానే…

“”💐💐👌👌👌👌👌👌👍👍👍👍🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏 ఇది వాస్తవం….. నిజం…… కొంతమందికి స్వరమాధుర్యము లేకపోయినా…… గాడిద స్వరము, కాకి రాగము…. పాడే వ్యక్తులకు కొంత రెమ్యూనరేషన్ ఇచ్చి స్వలాభం కోసం ఆర్గనైజర్స్ వారిని పెద్దవారిని చేస్తున్నారు. కంటెంట్ లేకపోయినా… కటౌట్ ముఖ్యమని తలుకు తలుకు డ్రస్సులతో… వచ్చి పోజులు కొడుతుంటారు. ఆర్గనైజర్ ఏదైనా సాంగ్ మార్చి లేక ఎవరైనా.. ప్రముఖులు అప్పటికప్పుడు వస్తే… వారితో ఒక పాట పాడండి. అని చెప్పినా కూడా…. నాకు ముందు చెప్పలేదుగా…. నేను ఆ పాట పాడను, ఈ పాట పాడను, అంటే నేను ఆయనతో పాడను…. నేను ఈమె తో పాడను.. అంటూ ఆర్గనైజర్స్ ని ఇబ్బందులు పెట్టే వ్యక్తులను చూస్తున్నాం. సినీ గాయకులకు లేని ఇబ్బంది. వీరుకుంటాయి… ఇంకొకరైతే…. తన పర్సనల్ సింగర్ని తెచ్చుకొని. ఆమె నాతోనే పాడుతుంది. వేరే వారితో పాడదు అంటూ… ఆర్గనైజర్ కి చెప్పటం. గాయని – గాయకులు ఒకరంటే ఒకరితో పడదు వారు వస్తే మేము రాము మేము వస్తే వారు రారు… అనే విధంగా ఉంది సినీ సంగీత విభావరి. పరిస్థితి. వీటన్నిటిని అధిగమించి ప్రోగ్రాం సజావుగా సాగుతుంటే….. వేరే వాళ్లకు తాగబోయించి. ప్రోగ్రాం ని చెడగొట్టమని చెప్పేవారు మరొకరు. ఎప్పుడు మారేది”‘ఇది పూర్తిగా రత్నం ఆవేదన.
మరి దీనిని బట్టి చూస్తే కళారంగం ముసుగులో ఏ విదమైన సంఘటనలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారిపై ఎవరు చర్యలు చేపడతారో డాలర్ల ప్రశ్న గా మిగిలిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article