Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుపల్నాడు జిల్లాలో బాంబుల కలకలం

పల్నాడు జిల్లాలో బాంబుల కలకలం

ఎన్నికల సందర్భంగా పిన్నెల్లిలో రెండు వర్గాల మధ్య గొడవ
గ్రామస్థుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
వైసీపీ నేతల నివాసాలలో పెట్రోల్ బాంబులు గుర్తించిన పోలీసులు

పల్నాడు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే, ఇరు పార్టీల నేతల ఫిర్యాదుతో గొడవకు కారణమైన నాయకులను అరెస్టు చేసేందుకు గ్రామంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు బయటపడడంతో పోలీసులు నివ్వెరపోయారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఆ బాంబులను కనుక పోలింగ్ రోజు ఉపయోగించి ఉంటే గ్రామంలో భారీ విధ్వంసం జరిగేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article