హైదరాబాద్: జాబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2007లో స్థలం కొనుగోలు చేసి నిర్మించిన ఇంటిపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఎన్టీర్ తరఫున జీపీఏ హోల్డర్ కె.రాజేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్ను విచారించింది.డీఆర్టీ ఇచ్చిన డాకెట్ ఆర్డర్ సమర్పించేందుకు వారం గడువు కావాలని, తదుపరి వెకేషన్ కోర్టులో విచారణకు అనుమతించాలని ఎన్టీఆర్ లాయర్ చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. జూన్ 6న రెగ్యులర్ కోర్టు విచారణ చేస్తుందని ప్రకటించింది. జూనియర్ ఎన్టీఆర్ చెపుతున్న వివరాల ప్రకారం… 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు.అయితే, ఆ భూమిని ఎన్టీఆర్ కు అమ్మిన వ్యక్తులు 1996లోనే దాన్ని తమ వద్ద తనఖా పెట్టి రుణం పొందారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో, తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమెపై కేసు నమోదయింది. మరోవైపు, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో… తమకు సమయం కావాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్ట్ చేయాలని ఎన్టీఆర్ న్యాయవాది కోరగా ధర్మాసనం తిరస్కరించింది. జూన్ 6కు తదుపరి విచారణను వాయిదా వేసింది.