*కేంద్రం,రాష్ట్రాలలో ఎన్డీఏ పాలనరానుంది..
*బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి..
చంద్రగిరి:ఐదేళ్ల వైకాపా అరాచక, దోపిడి,దౌర్జన్య పాలనను భరించి,ఇక సహించలేక రాష్ట్రo లోని ఓటర్లు వారి ఓట్లతో వైసిపి కి ప్యాకప్ చెప్పేశారని,జూన్ 4వ తేదీ ఇది నెరవేరనున్నదని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి జోష్యం చెప్పారు.శుక్రవారం
మీడియాముందుభాజపా నాయకులు వరప్రసాద్, మల్ల కుప్పం శేఖర్,బాల భాస్కర్,దయానిధి, నాదముని తదితరులతో కలిసి భాను మాట్లాడుతూ ఈ ఎన్నికలతో ఎన్డీఏ కూటమి దేశంలో,ఏపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడికి సంబంధించిన పెట్రోల్ బాంబులు,రాళ్లు, సమ్మెటలు ప్రెస్ క్లబ్ లో ప్రదర్శనగా ఉంచి,వైసిపి హత్యా రాజకీయాలు ఎలా ఉంటాయో మీడియా ముందు ప్రజలకు తెలిసేలా ప్రదర్శనగా ఉంచారు.
సీఎం జగన్ పాలనలో అవినీతికి తొత్తులుగా అధికారులుపనిచేశారని, వీరికి శిక్షలు పడటం ఖాయమన్నారు.
వైసిపి కి తొత్తుగా ఐపాక్ టీంమరోసారి వైసిపి పాలన రానున్నదని చేస్తున్న ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి
పట్టిస్తున్నారన్నారు. వైకాపా ప్లాన్ ఈ ఎన్నికల్లో బెడిసి కొట్టిందన్నారు. అందుకే పోలీస్ అధికారులు సైతం భారీగా సస్పెండ్ లు, ట్రాన్స్ ఫర్ లు అయ్యారన్నారు. జగన్ యూకే కెళ్ళే బదులు మోడీ చేసిన అభివృద్ధిని చూసేందుకు యూపీ కి వెళ్లి ఉండాల్సిందని చురకలు విసిరారు. విశాఖ నుంచి కుప్పం వరకు వైసిపి అవినీతి హత్యా రాజకీయాలు కొనసాగాయన్నారు. బీహార్ కు మించి ఏపీ తయారైందన్నారు. తప్పు చేస్తే ప్రతిపక్షమైనా స్వపక్షమైన శిక్ష తప్పదన్నారు.