కౌంటింగ్ కొరకు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి :ఎన్నికల పోలింగ్ సమయంలో మరియు పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో మరియు కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై, ఈసిఐ సూచనల దృష్ట్యా ఆం.ప్ర రాష్ట్ర సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, డిజిపి, సిఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో మరియు సిపి, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేస్తూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని, ఈవిఎం స్ట్రాంగ్ రూం వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు ఉండాలని సూచించారు. డిజిపి మాట్లాడుతూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసే చానెల్, కేబుల్ టీవీ, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాల పై తప్పక సంబంధిత సెక్షన్ ల కింద చర్యలు ఉంటాయని, ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణ తీసుకుని ప్రచురించాలని తెలిపారు. సెక్షన్ 144 సిఆర్పిసి అమలు చేయాలని సూచించారు. సిఈఓ మాట్లాడుతూ పోల్డ్ ఈవిఎం స్ట్రాంగ్ రూం లకు డబుల్ లాక్ ఏర్పాటు చేయాలని, మూడంచెల భద్రత, మెయిన్ ఎంట్రన్స్ వద్ద స్థానిక పోలీస్ యంత్రాంగం చెకింగ్ మరియు పర్యవేక్షణ ఉండాలని, సెకండ్ లేయర్ లో రాష్ట్ర సాయుధ బలగాల వారు ఉంటారని, కౌంటింగ్ విధులు కేటాయించబడిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, మూడవ లేయర్ కేంద్ర సాయుధ బలగాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అధికారులు స్ట్రాంగ్ రూం సందర్శన కొరకు వస్తే వారు స్ట్రాంగ్ రూం బయట పరిశీలించాక సందర్శకుల రిజిష్టర్ నందు వివరాలు నమోదు చేయాలనీ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ స్ట్రాంగ్ రూం సందర్శన చేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి, సీనియర్ పోలీస్ అధికారి సందర్శన చేసి జిల్లా ఎన్నికల అధికారికి రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేశారు. సరియైన బ్యారికాడింగ్ ఏర్పాటు ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారం పై తప్పక చర్యలు ఉంటాయని తెలిపారు.

కలెక్టర్ వివరిస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ ప్రాంతాల్లో అదనపు పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పి శ్రీనివాస రావు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.