Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలురాష్ట్రంలో కులగణన పచేపట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం.

రాష్ట్రంలో కులగణన పచేపట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం.

మంత్రి శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ.

ప్రజాభూమి, రామచంద్రపురం

రాష్ట్రంలో కుల గణనను గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చారిత్రాత్మకమైన నిర్ణయంతో కులగననకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం నేల పర్తిపాడు గ్రామంలోని రెండు క్లస్టర్లలో బిసి కులాల సంబంధించిన సమగ్ర కుల గణన ప్రక్రియను ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్రం రాకపూర్వం కుల గణన జరిగిందని, స్వాతంత్ర వచ్చిన తర్వాత జనాభా గణన జరిగింది, తప్ప కులగనన జరగలేదన్నారు. కుల గణన చేపట్టాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన జరగలేదన్నారు.బిసి కులాల మనోవభావాలను పరిగణలోనికి తీసుకొని వారికి న్యాయం జరగాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయంతో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా కులగననకు నాంది పలికారున్నారు. సమాజంలో అగ్రకులాల వారితో సమానంగా బ్రతుకుతున్న వారితో పాటు కొన్ని కులాల వారికి సమాన గౌరవం దక్కటం లేదనే కారణంతో కులగననకు నాంది అన్నారు.బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి కనీస అవసరాలు కల్పించి, వారు సుఖంగా జీవించాలని కోరుకున్నారన్నారు.
అదేవిధంగా గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా గ్రామ
స్వ పరిపాలన ఉండాలని మహాత్మా గాంధీ ఆకాంక్షించారన్నారు.మహిళలు చదువుకోవాలని ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే -వారిని ఆదర్శంగా తీసుకొని మహిళలకు సముచిత గౌరవం దక్కే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని , రాష్ట్రంలో జరుగుతున్న పనితీరును మంత్రి వివరించారు.పేదరికంలో మగ్గుతున్న, పేదరికం శాపంగా భావిస్తున్న ఆయా వర్గాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో కులగనలను చేపట్టడం అందులో భాగంగా రామచంద్రపురం నియోజవర్గం లోని నేలపార్తిపాడు గ్రామంలో చేపట్టడం బీసీ మంత్రిగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.కులగనన వలన రాష్ట్రంలో 145 బిసి, 58 ఎస్సీ, ఎస్టీ కులాల వారికి సముచితమైన న్యాయం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండల ఎంపీపీ అంబటి భవాని ,వైస్ ఎంపిపి శాఖా బాబి ,ఎంపీడీవో కీర్తి స్పందన స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article