రైల్వే ట్రాక్లపై సంచరిస్తూ రైలు కింద పశువులు పడిన యెడల పశు యజమానులకు రైల్వే యాక్ట్ ప్రకారం కఠినమైన చర్యలు మరియు శిక్షార్హులు
మార్కాపురం
మార్కాపురం రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే పరిసర గ్రామాలలో గుంటూరు ఆర్ పి ఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ కె.సత్య హరి ప్రసాద్ మరియు శైలేష్ కుమార్. వారి ఆదేశాలతో నరసరావుపేట (ఏ ఎస్ సి).సర్కిల్.ఇన్స్పెక్టర్.రవీంద్ర.ఆధ్వర్యంలో.మార్కాపురం ఆర్పిఎఫ్ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు. రాయవరం కేత గుడిపి నాయుడుపల్లి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు
నిర్వహించారు ఈ సందర్భంగా
వారితో మాట్లాడుతూ. రైల్వే ట్రాక్ కు సమీపంలో గల గ్రామ లలో సంచరిస్తూ తమ పశువులను మేత కొరకు పశువుల యజమానులు రైల్వే ట్రాక్ పై వదలడం వలన గత వారం రోజులలో దాదాపు 20 బర్రెలుప్రాణాలు కోల్పోయిన సంఘటన గురించి ప్రజలను ముందస్తుగా జాగ్రత్త పరచడం జరిగింది. ఇటువంటి సంఘటన కు బాద్యులయినా పశువుల యజమానులు పై రైల్వే చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియ జేశారు.ఈ చర్యల వలన ప్రజలు వారి విలువైన పశువుల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వేగం గా వెళ్ళు చున్న రైలు.డీ కొట్టడంతో రైలుకు కూడా అనేక సందర్భాలలో ప్రమాదం జరుగుతాయని తెలియ జేశారు. రైల్వే ప్రమాదాలలో చని పోయిన పశువుల యజమానులపై రైల్వే చట్టం ప్రకారం జైలు శిక్ష జరిమానా కూడా విధించ బడునని
రైల్వే ఆర్పిఎఫ్. ఎస్ ఐ. ఎం వెంకటేశ్వర్లు.తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు